- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండస్ట్రీలో పరిస్థితులు మారిపోయాయి.. వారంతా మహిళలనే టార్గెట్ చేస్తున్నారు: భూమి పడ్నేకర్
బాలీవుడ్ యంగ్ బ్యూటీ భూమి పడ్నేకర్ (Bhumi Pednekar)ఇటీవల ‘మేరే హస్బెండ్‌కి బీవీ’ (Mere Husband Ki Biwi)సినిమాతో ప్రేక్షకులను అలరించింది.

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ భూమి పడ్నేకర్ (Bhumi Pednekar)ఇటీవల ‘మేరే హస్బెండ్‌కి బీవీ’ (Mere Husband Ki Biwi)సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఓ వైపు వరుస సినిమాల్లో నటిస్తూనే మరోవైపు వెబ్‌సిరీస్‌ల్లోనూ రాణిస్తోంది. ‘దల్దాల్’ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న భూమి ఆసక్తికర కామెంట్స్ చేసింది. మహిళలపై జరుగుతున్న ట్రోలింగ్‌పై స్పందిస్తూ..‘‘సోషల్ మీడియాలో ముఖ్యంగా కొంతమంది మహిళలనే టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. వాటిని ఎదుర్కోవడంలో స్త్రీలు ఇబ్బందులు పడుతున్నారు. ట్రోలింగ్.. బెదిరింపులు దీన్ని మీరు ఏ విధంగా పిలిచినా.. మనం దాటిని అలవాటు పడ్డాం అని నాకు అనిపిస్తోంది.
మహిళలనే లక్ష్యంగా చేసుకున్నప్పుడు.. వాటిని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలియదు. ఎందుకంటే నాకు అంత ధైర్యం లేదు. ఇంకో మార్గం లేనందున నాకు నేనే సర్ది చెప్పుకుంటా. కానీ ఇండస్ట్రీలో పరిస్థితులు మారిపోయాయి. నేను నాపై వచ్చే ట్రోల్స్‌ను ఎలాగైనా తట్టుకోలగలనని తెలుసుకున్నాను. ఎవరు ఎమన్నా పట్టించుకోవడం మానేశాను. నా పని నేను చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నాను. సోషల్ మీడియాలో ఆధిపత్యం చెలాయించే ఈ రోజుల్లో జీవించడం నిరంతరం భిన్నమైన అభిప్రాయాలను తీసుకొస్తుంది.
నా జీవితంలో పరిస్థితులు నాకు చాలా నేర్పించాయి. టీనేజ్‌లో నేను హీరోయిన్ అవ్వాలనే కోరికతో ఈ ప్రయాణాన్ని స్టార్ట్ చేశాను. ఒకప్పుడు అవకాశం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూశాను. కానీ ఇప్పుడు నా లక్ష్యంతో పాటు ఒక వ్యక్తిగా అభివృద్ధి చెందాను. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ నా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.






