- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాకు అన్ని మతాల పట్ల సమాన గౌరవం ఉంది.. మా పెళ్లి ‘లవ్ జీహాద్’ కాదు: మోనాలినా
మా పెళ్లిపై ‘లవ్ జీహాద్’ ముద్ర వేయకండి. నేను మనస్ఫూర్తిగా, పూర్తి ఇష్టంతో హిందూ ఆచారాల ప్రకారమే ఆలయంలో వివాహం చేసుకున్నాను.

దిశ, సినిమా: గత ఏడాది ఉత్తరప్రదేశ్‌లో జరిగిన కుంభమేళాలో పూసలు అమ్ముతూ, తన అందంతో సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిన మోనాలిసా భోసలే పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. తన ప్రియుడు, నటుడు ఫర్మాన్ ఖాన్‌ను కేరళలోని తిరువనంతపురం సమీపంలో ఉన్న అరుమనూర్ శ్రీ సైనార్ దేవా ఆలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుంది. గత ఆరు నెలలుగా ప్రేమలో ఉన్న ఈ జంట, పెద్దలను ఎదిరించి మరి ఒక్కటయ్యారు. మోనాలిసా ఇండోర్ నివాసి కాగా, ఫర్మాన్ ఖాన్ ఉత్తరప్రదేశ్ వాసి. వీరిద్దరూ కలిసి ‘నాగమ్మ’ అనే మలయాళ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఈ విషయాన్ని పెద్దలకు చెప్పినప్పటికీ వారు ఒప్పుకోకపోవడంతో గుడిలో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అయితే ఈ పెళ్లిని దర్శకుడు సనోజ్ మిశ్రా 'లవ్ జీహాద్' అంటూ పెట్టిన పోస్ట్ నెట్టింట సంచలనంగా మారింది.
దీంతో నెటిజన్లు కూడా అదే ఫాలో అవుతూ.. పలు విమర్శలు చేస్తున్నారు. ఈక్రమంలో.. తాజాగా, తన పెళ్లిపై వస్తున్న ఆరోపణలపై మోనాలిసా ఘాటుగా స్పందించింది. "మా పెళ్లిపై ఇలాంటి ముద్రలు వేయకండి. నేను మనస్ఫూర్తిగా, పూర్తి ఇష్టంతో హిందూ ఆచారాల ప్రకారమే ఆలయంలో వివాహం చేసుకున్నాను. మాకు అన్ని మతాల పట్ల సమాన గౌరవం ఉంది. ఒక మేజర్‌గా నాకు ఇష్టమైన వ్యక్తిని పెళ్లాడే హక్కు నాకుంది" అని ఆమె స్పష్టం చేసింది. తాము ఎవరూ మతం మార్చుకోలేదని, ప్రేమలో మత మార్పిడి అవసరం లేదని ఫర్మాన్ ఖాన్ కూడా స్పష్టం చేశారు. మోనాలిసా మైనర్ అంటూ జరుగుతున్న ప్రచారాన్ని కూడా ఖండిస్తూ ఆమె ఆధార్, బర్త్ సర్టిఫికేట్లను మీడియాకు చూపించారు. కేరళ ప్రభుత్వ K-SMART యాప్ ద్వారా వీరి వివాహం చట్టబద్ధంగా రిజిస్టర్ చేసుకున్నారు.






