- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాకు ఒక పెద్ద ప్రమాదం జరిగింది.. కిచ్చా సుదీప్ షాకింగ్ కామెంట్స్
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్(Kichcha Sudeep) తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.

దిశ, సినిమా: కన్నడ స్టార్ కిచ్చా సుదీప్(Kichcha Sudeep) తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘ఈగ’ మూవీలో కిచ్చా సుదీప్ విలన్‌గా కనిపించి ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు. ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలవడంతో కిచ్చా రేంజ్ మారిపోయింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా హిట్ అందుకోలేకపోయాయి. ఇక గత ఏడాది వచ్చిన ‘మ్యాక్స్’ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం కిచ్చా సుదీప్ ‘మార్క్’ (Mark)చిత్రంతో రాబోతున్నారు. ఆయన కెరీర్‌లో 47వ ప్రాజెక్ట్‌గా రానుంది. షూట్ పూర్తి చేసుకుని క్రిస్మస్ కానుకగా రాబోతుంది. దీంతో ప్రమోషన్స్ జోరు పెంచిన కిచ్చా సుదీప్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘‘నా మొదటి సినిమా షూటింగ్ పూర్తి కాలేదు. నా రెండో మూవీ విడుదల కాలేదు.
నా మూడో సినిమాలో కేవలం మూల సీట్లు మాత్రమే నిండాయి. ఆ సమయంలో, మా నాన్న నాకు మరో అవకాశం ఇచ్చి, నా తర్వాతి ప్రాజెక్ట్ కూడా విఫలమైతే, నువ్వు ఇండస్ట్రీని వదిలేయాలని చెప్పారు. అప్పుడు చియాన్ విక్రమ్ నటించిన సేతు సినిమాను కన్నడలో రీమేక్ చేశారు. గుండు లుక్ కారణంగా చాలా మంది నటీనటులు ఆ సినిమాను తిరస్కరించారు. నేను ఆ సినిమాను అంగీకరించాను. షూటింగ్ ఏడవ రోజున నాకు ఒక పెద్ద ప్రమాదం జరిగింది. చివరికి ఆ సినిమా విడుదలైంది.. నాకు నా కెరీర్‌లో ఒక పెద్ద బ్రేక్ లభించింది’’ అని అన్నారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.






