- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అతనితో నాకు పెళ్లి అయింది.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన జాన్వీ కపూర్.. షాక్‌లో నెటిజన్లు!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూతురిగా జాన్వీ కపూర్(Janhvi Kapoor) ఇండస్ట్రీకి వచ్చి స్టార్ బ్యూటీగా మారింది.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూతురిగా జాన్వీ కపూర్(Janhvi Kapoor) ఇండస్ట్రీకి వచ్చి స్టార్ బ్యూటీగా మారింది. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ తెలుగు, హిందీ ఇండస్ట్రీల్లో దూసుకుపోతుంది. ఈ అమ్మడు ఇటీవల ‘పరం సుందరి’ (param sundari)చిత్రంతో ప్రేక్షకులను అలరిస్తోంది. త్వరలో ‘పెద్ది’ (peddi)సినిమాతో రాబోతుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా నటిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ కపూర్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘నేను గతంలో చాలా సార్లు పెళ్లి అయిందని అబద్దాలు చెప్పాను. వేరే దేశాల్లో ఉన్నప్పుడు అలాంటివి చెప్పేదాన్ని.
ఎందుకంటే.. నేను అమెరికాలో చాలామంది వెయిటర్లు రెస్టారెంట్లలో వాళ్ల నెంబర్లు నాకు ఇచ్చేవాళ్లు. నేను ఏం ఆర్డర్ ఇవ్వకముందే.. నేను కూర్చున్న టేబుల్ వద్దకు ఫుడ్ తీసుకొచ్చి పెట్టేవాళ్లు. అలా ఒక్కసారి కాదు.. చాలాసార్లు అలాగే చేయడంతో ఏం చేయాలో అర్ధం కాక నా స్నేహితుడు ఓరీతో నాకు పెళ్లి అయిందని అబద్దం చెప్పాను. దీంతో వాళ్లంతా నన్ను పట్టించుకోవడం మానేశారు. ఆ రోజులను ఎప్పటికీ మర్చిపోలేను’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం జాన్వీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు షాక్ అవుతున్నారు. కాగా.. ఈ అమ్మడు గత కొద్ది కాలంగా మహారాష్ట్ర మాజీ సీఎం మనువడు శిఖర్ పహారియాతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈక్రమంలోనే వీరిద్దరు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండటంతో పెళ్లి వార్తలు జోరందుకున్నాయి. కానీ వాటిని వీరిద్దరు పట్టించుకోవడం మానేశారు.






