అలాంటివి అస్సలు నచ్చవు.. కానీ ఈ కఠిన నిర్ణయం ఆయన కోసమే తీసుకున్నా: శ్రీలీల

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-07 07:30:43  IST  )

డాన్సింగ్ క్వీన్ శ్రీలీల (Sreeleela) ‘పరాశక్తి’ (Parashakti)మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.

అలాంటివి అస్సలు నచ్చవు.. కానీ ఈ కఠిన నిర్ణయం ఆయన కోసమే తీసుకున్నా: శ్రీలీల
X

దిశ, సినిమా: డాన్సింగ్ క్వీన్ శ్రీలీల (Sreeleela) ‘పరాశక్తి’ (Parashakti)మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో శివకార్తికేయన్ (Sivakarthikeyan)సరసన రొమాన్స్ చేయనుంది. ఇది ఆయన కెరీర్‌లో 25వ సినిమాగా రాబోతుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సుధా కొంగర దర్శకత్వంలో రాబోతుండగా.. రవి మోహన్, అథర్వ మురళి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ సినిమా సంక్రాంతి కానుకగా.. జనవరి 10న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఈక్రమంలో.. ప్రమోషన్స్ జోరు పెంచిన శ్రీలీల ఓ ఇంటర్వ్యూలో భాగంగా షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘ఐటమ్ సాంగ్ చేయడం నాకు ఇష్టం లేదు. కానీ కేవలం అల్లు అర్జున్ ‘పుష్ప-2’ కోసం మాత్రమే నేను ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాను. నేను హీరోయిన్‌గా చేసే సినిమాలలో డ్యాన్స్ చేయడానికి ఇష్టపడతాను.

కానీ ఐటమ్ సాంగ్స్ చేయడానికి కాదు. నాకు అలాంటివి చేయడం అస్సలు నచ్చదు.. కానీ పుష్పలో డ్యాన్స్ చేయాలనే నా నిర్ణయం సరైనదే అని నిరూపించుకున్నా అనే అనుకుంటున్నా. ఎందుకంటే దాని వల్ల నాకు ఊహించినంత గుర్తింపు లభించింది. నేను నటించిన ‘పరాశక్తి’లో రత్నమాల వంటి తేలికపాటి డ్యా్న్స్ స్టెప్స్ ఉన్నాయి కానీ స్పెషల్ సాంగ్ లేదు’’ అని చెప్పింది. కాగా.. శ్రీలీల ‘పుష్ప-2’లో చేసిన ‘కిస్సిక్’ సాంగ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వరుస ఫ్లా్పులతో సతమతమవుతున్న శ్రీలీలకు అది గోల్డెన్ ఆఫర్ అని చెప్పొచ్చు ఈ సినిమా తర్వాత అమ్మడుకి ప్రపంచవ్యాప్తంగా ఫాపులారిటీ వచ్చింది. అంతేకాకుండా సినీ కెరీర్ పరంగా కూడా కలిసొచ్చింది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా వరుస అవకాశాలు అందుకుంటోంది.

Read More..

Samantha: పెళ్లైన నెలకే గుడ్ న్యూస్ ప్రకటించిన సమంత..షాక్‌లో నెటిజన్లు (పోస్ట్)

Next Story