నేనెప్పుడూ అలా జరగుతుందని అనుకోలేదు.. అది నా విధి అనిపిస్తోంది: మోహన్‌లాల్

by Mallepaka Hamsa |

ఇటీవల వరుస హిట్స్‌తో బాక్సాఫీసును షేక్ చేసి కుర్ర హీరోలకు గట్టిపోటీనిస్తున్నారు మోహన్‌లాల్(Mohanlal).

నేనెప్పుడూ అలా జరగుతుందని అనుకోలేదు.. అది నా విధి అనిపిస్తోంది: మోహన్‌లాల్
X

దిశ, సినిమా: ఇటీవల వరుస హిట్స్‌తో బాక్సాఫీసును షేక్ చేసి కుర్ర హీరోలకు గట్టిపోటీనిస్తున్నారు మోహన్‌లాల్(Mohanlal). తుడరుమ్, లూసీఫర్-2, హృదయపూర్వంతో పాటు జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. 65 ఏళ్లు వచ్చినప్పటికీ నటనకు బ్రేక్ తీసుకోకుండా ఇప్పటికీ వరుస చిత్రాలతో ఫుల్ ఫామ్‌లో దూసుకెళ్తున్నారు. ఇక ఆయన పిల్లలు ప్రణవ్, విస్మయ కూడా ఇండస్ట్రీలో రాణిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, మోహన్‌లాల్ తన కూతురు ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘తుడక్కమ్’(Thudakkam) పూజా కార్యక్రమాలకు గెస్ట్‌గా వచ్చాడు. దీపాలు వెలిగించి గ్రాండ్‌గా ప్రారంభించిన ఆయన.. అనంతరం పలు కామెంట్లు చేశారు.

‘‘నా పిల్లలు విస్మయ, ప్రణవ్ (Pranav) ఇండస్ట్రీలో కెరీర్ కొనసాగిస్తారని నేను ఊహించలేదు. ఇద్దరికీ స్వేచ్ఛ ఇచ్చాను. నా పిల్లలిద్దరు తమ సొంత మార్గాలను అనుసరించాలనుకున్నప్పుడు నేను వారి నిర్ణయాన్ని గౌరవించాను. విస్మయ నటనపై ఆసక్తి చూపినప్పుడు హృదయపూర్వకంగా నా మద్దతు ఇచ్చాను. మా సొంత నిర్మాణ సంస్థ, ఆంటోనీ పెరుంబవూర్ బలమైన మద్దతుతో విస్మయ సినిమాల్లోకి రావడం సంతోషంగా ఉంది. ఈ ప్రయాణాన్ని ప్రారంభించడానికి మేము సహాయం చేయగలుగుతున్నాము.

నా జీవితంలో ప్రతిదీ ఒక అద్భుతంలా అనిపించింది. అందుకే నేను నా కూతురికి విస్మయ అని పేరు పెట్టా. నేను ఎప్పుడూ నటుడిని కావాలని కోరుకోలేదు. కానీ అది నా విధి. నా పిల్లలు కూడా సినిమా రంగంలోకి వస్తారని నేను ఎప్పుడూ అనుకోలేదు. నా ప్రయాణంలో నేను ఒంటరిగా లేను. నా పిల్లలు, దర్శకులు, స్నేహితులు నాకు తోడుగా ఉన్నారు’’ అని చెప్పుకొచ్చారు. ఇక మోహన్ లాల్ కూతురు హీరోయిన్‌గా పరిచయం కాబోతుండటం గురించి తెలుసుకున్న వారంతా కంగ్రాట్స్ చెబుతున్నారు.

Next Story