జవాన్ డైరెక్టర్ తిట్టాడు బోరున ఏడ్చసా.. దాన్ని ఎప్పటికీ మర్చిపోను: సిరి హనుమంత్

by Hamsa |   ( Updated:2023-09-19 06:23:55.0  )
జవాన్ డైరెక్టర్ తిట్టాడు బోరున ఏడ్చసా.. దాన్ని ఎప్పటికీ మర్చిపోను: సిరి హనుమంత్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు యూట్యూబర్ సీరియల్ నటి సిరి బిగ్‌బాస్ షో తర్వాత ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఇటీవల షారుఖ్ ఖాన్ ‘జవాన్’ సినిమాలో సిరి మనుమంత్ కొన్ని సీన్స్‌లో కనిపించింది. అయితే ఈ విషయం సిరి సినిమాలో కనిపించే వరకు ఎవరికీ తెలియదు. సిరిని జవాన్ సినిమాలో చూసి తెలుగు ఆడియన్స్ ఆశ్చర్యపోయారు. జవాన్ చిత్రం విడుదలై మంచి విజయం సాధించింది.

తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సిరి అసలు జవాన్‌లో నటించే అవకాశం ఎలా వచ్చిందో వివరించింది. ‘‘ఈ సినిమాలో నటించడానికి ఫోన్ వచ్చినప్పుడు.. ముందు నేను నమ్మలేదు. అది ప్రాంక్ కాల్ అని లైట్ తీసుకున్నాను. ఆ తర్వాత మేనేజర్ కూడా ఫోన్ చేసి చెప్పడంతో షాక్ అయ్యాను. షూటింగ్ కోసం ముంబై వెళ్ళాను. సెట్స్ లో షారుఖ్ గారిని చూసేదాకా నమ్మకం కలగలేదు. అంతా అయోమయంగా అనిపిచింది. ఇక సెట్స్‌లో కూడా ఇది షారుఖ్ సినిమానా అని అందరినీ అడిగాను. మొదటి సారి షూటింగ్ వెళ్లడంతో కాస్త భయంగా అనిపించింది. దీంతో శ్రీహాన్‌ను తీసుకుని వెళ్లాను. నేను తెలుగు అమ్మాయిని అని అట్లీ గారికి తెలియదు. నన్ను కూడా హిందీ నటి అనుకున్నారు. ఒక సీన్ చేస్తున్నప్పుడు డైలాగ్ సరిగ్గా చెప్పలేక ఏడు టేక్స్ తీసుకున్నాను. అప్పుడు అట్లీ సార్ బాగా తిట్టడంతో ఏడ్చేశాను. అప్పుడు షారుఖ్ గారు నా దగ్గరకు వచ్చి మోటివేట్ చేశారు. ఆయనతో నటించడమే కలలా ఉందంటే.. ఇక నా దగ్గరకు వచ్చి మోటివేట్ చేయడం ఎప్పటికీ మర్చిపోలేను’’ అంటూ చెప్పుకొచ్చింది.

Read More..

హీరోయిన్లను చంపేస్తున్న ‘జవాన్’ డైరెక్టర్ అట్లీ.. ఎందుకో తెలుసా?

Advertisement

Next Story

Most Viewed