ఈ అభిమానం ఎప్పటికీ మర్చిపోలేను..థాంక్యూ సో మచ్

by Mallepaka Hamsa |

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), హిట్ మెషిన్ అనిల్ రావిపూడి (Anil Ravipudi)మెగా బ్లాక్ బస్టర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో అలరించారు.

ఈ అభిమానం ఎప్పటికీ మర్చిపోలేను..థాంక్యూ సో మచ్
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), హిట్ మెషిన్ అనిల్ రావిపూడి (Anil Ravipudi)మెగా బ్లాక్ బస్టర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో అలరించారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రంలో నయనతార కథానాయిక నటించారు. శ్రీమతి అర్చన ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేశారు. ప్రిమియర్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం మెగా బ్లాక్ బస్టర్ సక్సెస్‌తో అందుకొని రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్‌తో హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ మెగా బ్లాక్ బస్టర్ థాంక్ యూ మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా..డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ఈ సంక్రాంతిని కూడా నాకు ఇంత మెమొరబుల్‌గా చేసిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ థాంక్యూ సో మచ్. మళ్లీ మళ్లీ ఇలాంటి మంచి సినిమాలు తీసి మీకు ఆనందాన్ని ఇచ్చి దాని ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఇందులో రాసిన ప్రతి సీన్‌కి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారే. అందుకే ఈ క్రెడిట్ మొత్తం చిరంజీవి గారికి ఇస్తాను. మెగా ఫ్యాన్స్ అభిమానం ఎప్పటికీ మర్చిపోలేను. ఇదంతా కుదిరింది అంటే దానికి కారణం చిరంజీవి గారు. ఆయనతో పనిచేసిన 85 రోజులు ప్రతిరోజు ఒక బ్యూటిఫుల్ మెమరీ. ఆయన గురించి ఇంకా చెప్పాల్సింది ఎంతో ఉంది.

అది సక్సెస్ మీట్ లో చెప్తాను’’ అన్నారు. ప్రొడ్యూసర్ సుస్మిత కొణిదెల మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు సినిమా ప్రేక్షకులు చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. కలెక్షన్స్ టాక్ రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. సినిమా లాంచింగ్ సమయంలో నాన్నగారు నా పేరు అడిగితే సుస్మిత కొణిదెల అని చెప్పాను. ఆ పేరు నిలబెట్టుకో అన్నారు. ఆ పేరు నిలబెట్టుకున్నానని అనుకుంటున్నాను. నాకు సాహు గారికి అనిల్ గారు సంక్రాంతికి బిగ్ గిఫ్ట్ ఇచ్చారు. అందుకు ఆయనకి ధన్యవాదాలు. ఇంత అద్భుతమైన విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.

Next Story