భూమా మౌనికను టార్చర్ పెడుతున్నా.. మంచు లక్ష్మి కామెంట్స్ వైరల్

by Disha Web Desk 6 |
భూమా మౌనికను టార్చర్ పెడుతున్నా.. మంచు లక్ష్మి కామెంట్స్ వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ నటి మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సీనియర్ హీరో మోహన్ బాబు కూతురిగా, యాక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా పలు చిత్రాల్లో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించింది. అయితే మంచు మనోజ్, భూమా మౌనికల పెళ్లి మంచు లక్ష్మి దగ్గరుండి మరీ చేయించింది.

తాజాగా, మంచు లక్ష్మి, తమ్ముడు మనోజ్ వివాహం గురించి ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘‘నాకు ఏ సాయం కావాలన్నా చేసేందుకు మనోజ్‌ ముందుంటాడు. గతంలో యాదాద్రికి వెళ్లినప్పుడు.. మనోజ్‌- మౌనికకు పెళ్లి చేయి దేవుడా.. నా వల్ల కావడం లేదు. మా నాన్నను ఒప్పించు అని వేడుకున్నాను. ఇక్కడ సమస్య ఏంటంటే.. రెండు కుటుంబాలకు ఓ చరిత్ర ఉంది. పెళ్లి చేసుకుని సంతోషంగా కలిసి ఉండగలమా అన్న సందేహం వారికుంది. దీంతో ఇరు కుటుంబ సభ్యులు నిరాకరించారు. కానీ, ఎలాగోలా వారికి పెళ్లి అయింది.

సంతోషంతో వాళ్లను యాదాద్రికి తీసుకెళ్లి స్వామివారి దర్శనం చేయించాను. ఆయన నా మాట విన్నాడనిపించింది. పెళ్లికి ముందు వరకు ఇద్దరూ నాతో పాటు ఉన్నారు. పెళ్లయ్యాక ఓ ఇల్లు తీసుకుని ఉంటున్నారు. ప్రతిదానికి ఫోన్‌ చేసి ఇదెలా చేయాలి? అదెలా చేయాలి? అని మౌనిక అడుగుతూ ఉంటుంది. అలా ఫోన్‌ చేసినప్పుడల్లా నా దగ్గర ఉన్నప్పుడు ఒక్కసారైనా అడిగావా? ఎలాగైనా చేసుకుపో అని టార్చర్‌ పెడుతున్నాను. కానీ తనకు చాలా ఓపిక ఉంటుంది. ఇకపోతే నాకు పిల్లలంటే ఇష్టం. ముగ్గురు, నలుగురిని కనాలనుకున్నా.. కానీ దేవుడు ఒక్కరినే ఇచ్చాడు. రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి లేదు’’ అంటూ చెప్పుకొచ్చింది.

Read More: విడాకులకు సిద్ధమైన మరో టాలీవుడ్ స్టార్ హీరోయిన్?



Next Story

Most Viewed