- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డబ్బులు తీసుకోకుండా వారి సినిమాల్లో చేశా.. అడిగినా నాకు ఒక్కరు కూడా సపోర్ట్ చేయట్లేరు: కిచ్చా సుదీప్
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్(Kichcha Sudeep), సినిమాలు, బిగ్‌బాస్ షోలో హోస్ట్‌గా వ్యవహరిస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు.

దిశ, సినిమా: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్(Kichcha Sudeep), సినిమాలు, బిగ్‌బాస్ షోలో హోస్ట్‌గా వ్యవహరిస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. అంతేకాకుండా స్టార్ హీరోల చిత్రాల్లో విలన్‌గా గెస్ట్ రోల్స్ చేస్తూ.. ప్రేక్షకులను అలరిస్తున్నారు. టాలీవుడ్ లోనూ పలు ప్రాజెక్ట్ చేసిన కిచ్చా సుదీప్ ప్రత్యేకమైన ఫాలోయింగ్‌ను రాబట్టుకున్నాడు. అయితే తాను క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారి పలు విభిన్న పాత్రలు చేస్తూ సపోర్ట్ చేస్తున్నప్పటికీ మిగతా ఇండస్ట్రీలకు చెందిన హీరోలు మాత్రం తనకు అండగా నిలబడం లేదని చెప్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. నేను శివరాజ్ కుమార్, ఉపేంద్ర.. మిగతా భాషల్లో అతిథి పాత్రల్లో నటించాం.
కాకపోతే అయా భాషల స్టార్స్ మాత్రం కన్నడ హీరోలకు సపోర్ట్ చేయడం లేదు. కన్నడ సినిమాలకు సపోర్ట్ దొరకడం లేదు. మా చిత్రాల్లో నటించేందుకు కొందరు ఆసక్తి చూపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను ఇతర భాషల్లో చేసిన సినిమాలకు డబ్బులు కూడా తీసుకోకుండా నటించినట్లు చెప్పాడు. వ్యక్తిగతంగా మిగతా ఇండస్ట్రీలోని పలువురు హీరోలని తన మూవీలో అతిథి పాత్రలో చేయమని అడిగినప్పటికీ.. వాళ్లు అంగీకరించడం లేదని అన్నాడు. ఇది ఇరువైపులా జరగాల్సిన ప్రయత్నం.. కానీ ప్రస్తుతం అది జరుగుతున్నట్లు నాకు కనిపించడం లేదన సంచలన వ్యాఖ్యలు చేశాడు.
కన్నడ సినిమాలకు సరైన మద్దతు, గుర్తింపు రావాలని తాను ఎప్పటినుంచో కోరుకుంటున్నానని, అందుకే ఇతర భాషల్లో నటిస్తూ బ్రిడ్జ్‌లా పనిచేయాలనుకున్నానని సుదీప్ అన్నారు. అయితే ఆ ప్రయత్నానికి పూర్తి స్థాయిలో స్పందన లేకపోవడం తనను బాధపెడుతోందని వెల్లడించారు. ఇండస్ట్రీల మధ్య గ్యాప్ తగ్గాలంటే పెద్ద హీరోల స్థాయిలో సహకారం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కిచ్చా సుదీప్ కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తున్నాయి. . కొందరు అభిమానులు ఆయన మాటలకు మద్దతుగా నిలుస్తుండగా, మరికొందరు ఇతర ఇండస్ట్రీల వైఖరిని ప్రశ్నిస్తున్నారు.






