- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెళ్లికి పాత ఆలోచనా? అక్రమ సంబంధాలపై హైపర్ ఆది సంచలన వ్యాఖ్యలు
జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది(Hyper Adi) పలు చిత్రాల్లోనూ నటించి ఎంతో పాపులారిటీ దక్కించుకున్నాడు.

దిశ, సినిమా: జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది(Hyper Adi) పలు చిత్రాల్లోనూ నటించి ఎంతో పాపులారిటీ దక్కించుకున్నాడు. అంతేకాకుండా ఢీ షోలోనూ మెంటర్‌గా చేసిన ఆది తన కామెడీతో జడ్జెస్‌ను ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నారు. ఇటీవల ‘మాస్ జాతర’(mass jathara) మూవీతో అలరించారు. ప్రస్తుతం స్టార్ హీరోల చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీ అయిపోయారు. ఈక్రమంలో..తాజాగా, ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆది కీలక వ్యాఖ్యలు చేశాడు. కుల వ్యవస్థ , పరువు హత్యలపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. నా కాలేజీ రోజుల నుంచే కుల భావన మీద విరక్తి ఉందని, మనుషులను కులం పేరుతో విభజించడం వల్ల సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదని ఆయన అన్నారు. అవసరం వచ్చినప్పుడు కులం పనిచేయదు, కేవలం మనిషి మాత్రమే తోడుంటాడు అని ఆది స్పష్టం చేశారు.
ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు డాక్టర్ కులం ఏంటో అడగని మనం, పెళ్లి విషయానికి వచ్చేసరికి మాత్రం కులాన్ని వెతకడం ఏంటని? ప్రశ్నించారు. అంతేకాకుండా.. సమాజంలోని ద్వంద్వ వైఖరిని ప్రశ్నిస్తూ.. అక్రమ సంబంధాల విషయంలో అడ్డురాని కులం, కేవలం పెళ్లిళ్ల దగ్గరే ఎందుకు గుర్తొస్తుంది?’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట సంచలనంగా మారాయి. పెళ్లికి పాత ఆలోచనా? అక్రమ సంబంధాలు మాత్రం ఎవరితో అయినా? పెట్టుకోవచ్చా అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. సమాజంలో పెరుగుతున్న పరువు హత్యలపై ఆది మాట్లాడుతూ..‘‘ వేరే కులాన్ని ప్రేమించారనే కారణంతో కన్నబిడ్డల ప్రాణాలు తీయడం అత్యంత దారుణం. ఇది పరువును పెంచకపోగా మనుషుల మధ్య దూరాన్ని పెంచుతుంది.
నిజమైన ప్రేమతో ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి ఉండగలరని అనిపిస్తే, వారికి అండగా నిలవాల్సిన బాధ్యత కుటుంబాలపై ఉంది. అబ్బాయి ఆర్థికంగా స్థిరంగా లేకపోతే, అతనికి తగిన సమయం ఇచ్చి, ఉద్యోగం వచ్చిన తర్వాత వివాహం చేయడం సరైన మార్గం. కానీ చిన్న విషయాలకే హింసకు దారి తీయకుండా, ఆవేశాన్ని తగ్గించుకుని ఆలోచిస్తే ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది కానీ హింస వల్ల కేవలం విషాదమే మిగులుతుంది’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆది చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు సైతం పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. మీరు చెప్పింది ముమ్మాటికీ నిజమని అంటున్నారు.






