ప్రాణాపాయ స్థితిలో హృతిక్ రోషన్ గర్ల్ ఫ్రెండ్.. ఆకుకూరల విషయంలో జాగ్రత్త అంటూ షాకింగ్ పోస్ట్

by Mallepaka Hamsa |

కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఏకంగా 4 కిలోల బరువు తగ్గిపోయానని, ప్రస్తుతం కనీసం నడవడానికి కూడా ఓపిక లేని స్థితికి చేరుకున్నానని సబా పేర్కొన్నారు.

ప్రాణాపాయ స్థితిలో హృతిక్ రోషన్ గర్ల్ ఫ్రెండ్.. ఆకుకూరల విషయంలో జాగ్రత్త అంటూ షాకింగ్ పోస్ట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ గర్ల్ ఫ్రెండ్, నటి, సింగర్ సబా అజాద్ గత రెండు వారాలుగా ఒక భయంకరమైన ఆరోగ్య సమస్యతో పోరాడుతున్నారు. ‘సైక్లోస్పోరా కయెటానెన్సిస్’ అనే ప్రమాదకరమైన బ్యాక్టీరియా వల్ల ఆమె తీవ్రమైన కడుపు ఇన్ఫెక్షన్‌కు గురయ్యారు. ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఆమె, తన తాజా పరిస్థితిని ఇన్‌స్టా ద్వారా వివరిస్తూ నెటిజన్లను హెచ్చరించారు. గడిచిన 14 రోజులు తన జీవితంలోనే అత్యంత దారుణమైనవని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఏకంగా 4 కిలోల బరువు తగ్గిపోయానని, ప్రస్తుతం కనీసం నడవడానికి కూడా ఓపిక లేని స్థితికి చేరుకున్నానని సబా పేర్కొన్నారు. తన అనారోగ్యానికి గల కారణాలను తెలుపుతూ నెటిజన్లకు ఆమె కొన్ని కీలక సూచనలు చేశారు. తాను ఎప్పుడూ ఇంట్లో వండిన ఆహారాన్నే తింటానని, బయటకు వెళ్లినా సొంత వాటర్ బాటిల్‌నే వెంట తీసుకెళ్తానని, అంత జాగ్రత్తగా ఉన్నా ఈ ఇన్ఫెక్షన్ ఎలా సోకిందో అర్థం కావడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

అందుకే మనం తినే ఆకుకూరలు, సలాడ్స్, వెజిటేబుల్స్‌ను ప్రాణం పెట్టి శుభ్రం చేయాలని ఆమె హెచ్చరించారు. ప్రస్తుతం తాము బేకింగ్ సోడా, వెజీ వాష్ ఉపయోగించి కూరగాయలను కడుగుతున్నామని, పొట్ట ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఆమె సూచించారు. హాస్పిటల్ బెడ్‌పై నీరసంగా ఉన్న తన ఫోటోను షేర్ చేస్తూ, తన ప్రియుడు హృతిక్ రోషన్ గురించి ఆమె ఎమోషనల్ అయ్యారు. తన మూడ్ ఎంత బాలేకపోయినా హృతిక్ పక్కనే ఉండి నవ్విస్తున్నారని, ఆయనే ఈ ఫోటో తీశారని తెలిపారు. ఫోటో యాంగిల్ వల్ల తాను చాలా చిన్నగా కనిపిస్తున్నానని సబా వివరించారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు మరియు సినీ సెలబ్రిటీలు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.

Next Story