‘మన శంకర వరప్రసాద్ గారు’ కోసం ఎవరెవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారంటే..?

by I. Sairam |

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సినిమా ‘మన శంకర వర ప్రసాద్‌గారు’ (mana shankara varaprasad garu).

‘మన శంకర వరప్రసాద్ గారు’ కోసం ఎవరెవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సినిమా ‘మన శంకర వర ప్రసాద్‌గారు’ (mana shankara varaprasad garu). ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి (Anil Ravipudi) తెరకెక్కిస్తుండగా షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఇక లేడీ సూపర్ స్టార్ నయనతార, క్యాథరిన్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తుండగా టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్‌లో కనిపించబోతున్నారు.

అయితే ఈ మూవీ సంక్రాంతి కానుకగా నేడు విడుదల అయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటుంది. ఈ క్రమంలో ఎవరెవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారని ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మన శంకర వరప్రసాద్ గారు మూవీలో యాక్ట్ చేయడం కోసం మెగాస్టార్ చిరంజీవి రూ.70 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారట.

అలాగే లేడీ సూపర్ స్టార్ నయనతార స్టార్టింగ్ రూ.18 కోట్లు డిమాండ్ చేయగా చివరకు రూ.6కోట్లకు ఫిక్స్ చేసుకున్నదట. ఇక వెంకటేష్ కేవలం స్క్రీన్ మీద 20 నిమిషాలు కనిపించడం కోసం రూ.9 కోట్లు, డైరెక్టర్ అనిల్ రావిపూడి రూ.25 కోట్లు తీసుకున్నారట. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story