హారర్ థ్రిల్లర్ గ్లింప్స్ అప్డేట్.. క్రూరంగా, ప్రాణాంతకంగా ఉండబోతుందంటూ హైప్ పెంచుతున్న పోస్ట్

by Mallepaka Hamsa |

స్త్రీ, స్త్రీ-2, ముంజ్యా, భేడియా వంటి హారర్ మూవీస్ తెరకెక్కించిన మాడాక్ ఫిల్మ్స్ ఎన్నో హిట్స్ సాధించింది.

హారర్ థ్రిల్లర్ గ్లింప్స్ అప్డేట్.. క్రూరంగా, ప్రాణాంతకంగా ఉండబోతుందంటూ హైప్ పెంచుతున్న పోస్ట్
X

దిశ, సినిమా: స్త్రీ, స్త్రీ-2, ముంజ్యా, భేడియా వంటి హారర్ మూవీస్ తెరకెక్కించిన మాడాక్ ఫిల్మ్స్ ఎన్నో హిట్స్ సాధించింది. ప్రస్తుతం ఓ హారర్ కామెడీ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ‘థమా’ (thama)టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ బ్యానర్‌లో వచ్చిన ‘స్త్రీ-2’ మూవీ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మూవీ మేకర్స్ ‘థమా’ చిత్రంపై బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ఆగస్టు 19న విడుదల కాబోతున్నట్లు తెలుపుతూ ఓ చిన్న వీడియోను షేర్ చేసి హైప్ పెంచారు. ‘‘స్వాతంత్ర్య దినోత్సవ స్పెషల్! నంబర్ 1 హిందీ చిత్రం స్ట్రీ 2 ఈరోజుతో 1వ వసంతం పూర్తి చేసుకుంది.

దినేష్ విజన్(Dinesh Vijan) హర్రర్-కామెడీ ‘థమా’ తో రాబోతున్నారు. ది వరల్డ్ ఆఫ్ థామా భయపెట్టడానికి వస్తోంది. ఈ చిత్రం ఈ దీపావళి 2025 సినిమా థియేటర్లలోకి దూసుకుపోతుంది.ఈ అధ్యాయం ఒక ప్రేమకథ, మీరు ఇంతకు ముందు చూసిన దానికంటే క్రూరంగా, ప్రాణాంతకంగా ఉంటుంది’’ అని రాసుకొచ్చారు. కాగా, ఈ మూవీలో రష్మిక మందన్నా(Rashmika Mandanna), అయుష్మాన్ ఖురానా(Ayushmann Khurrana) జంటగా కనిపించబోతున్నారు. ఈ సినిమాకు ముంజ్యా డైరెక్టర్ ఆదిత్య సర్పోట్దార్ దర్శకత్వం వహిస్తున్నారు. దీనిని దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మిస్తున్నారు. ఇందులో పరేష్ రావల్, నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య రాబోతుంది.

Next Story