Honey Rose: ఆ స్టార్ హీరో సినిమాలో బంఫర్ ఆఫర్ కొట్టేసిన హనీ రోజ్..

by Kavitha |
Honey Rose: ఆ స్టార్ హీరో సినిమాలో బంఫర్ ఆఫర్ కొట్టేసిన హనీ రోజ్..
X

దిశ, సినిమా: హీరోయిన్ హనీ రోజ్ పేరు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. గత ఏడాది బాలయ్య సరసన ‘వీర సింహారెడ్డి’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ఒక్క సినిమాతో భారీ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ మూవీ తర్వాత హనీ బాగా బిజీ అయిపొతుంది అనుకున్నాను కానీ .. అనుకున్నంతగా అవకాశాలు రాలేదు. అప్పుడప్పుడు షాపింగ్ మాల్‌ ఓపెనింగ్స్ లో తప్పితే.. హనీ రోజ్ మరో తెలుగు సినిమాలో కనిపించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు ఎప్పుడు దగ్గరగా ఉంటుంది.

అయితే తాజా సమాచారం ప్రకారం మొత్తానికి ఈ బ్యూటీ ఓ టాలీవుడ్ మూవీలో ఛాన్స్ దక్కించుకుంది. అది కూడా మెగాస్టార్ చిరంజీవికి జోడిగా నటించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చిరంజీవి చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్స్ లో ‘విశ్వంభర’ ఒకటి. దర్శకుడు వశిష్ఠ రూపొందిస్తున్న ఈ మూవీ ఇటీవలే టైటిల్ ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా లో మొత్తం ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. అందులో హనీ రోజ్ కూడా ఒకరని తెలుస్తొంది.

Next Story