వర్ష బొల్లమ్మ ఆ పాడు పనులు... హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం ?

by Veldandi saikiran |
వర్ష బొల్లమ్మ ఆ పాడు పనులు... హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం ?
X

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ ఇండస్ట్రీలో (Tollywood) ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో కొంతమంది మాత్రమే.. అతి తక్కువ కాలంలో పాపులర్ అవుతూ ఉంటారు. అలాంటి వారిలో హీరోయిన్ వర్ష బొల్లమ్మ ( varsha bollamma) ఒకరు. ఈ బ్యూటీ తెలుగులో తీసింది తక్కువ సినిమాలు అయినప్పటికీ... తొందరగా పాపులర్ అయింది. బడా హీరోలతో సినిమాలు కూడా పెద్దగా చేయనప్పటికీ... తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుని వర్ష బొల్లమ్మ (varsha bollamma).

అయితే అలాంటి హీరోయిన్ వర్ష బొల్లమ్మ ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నారు. పొట్టి బట్టలు వేసుకొని.. హిందూ సంఘాలకు ( Hindu organizations ) ఆగ్రహం తెప్పించారు. ఇంతకీ హీరోయిన్ వర్ష బొల్లమ్మ ఏం చేసిందంటే? ఆమె షేర్ చేసిన తన హాట్ ఫోటోలే కొంపముంచాయి. పొట్టి బట్టలు వేసుకొని... ఓ ఆవు ముందు ఫోజులిచ్చింది హీరోయిన్ వర్ష బొల్లమ్మ . దీంతో... హిందూ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సాంప్రదాయ బద్ద వస్త్రాలు ధరించి గోమాత ముందు నిల్చోని ఫోటోలు దిగాలి కానీ... ఇలా పొట్టి బట్టలతో కాదమ్మా అంటూ ఫైర్ అవుతున్నారు. దీనిపై వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. దింతో వర్ష బొల్లమ్మ (varsha bollamma) కొత్త చిక్కుల్లో పడ్డారు. ఇది ఇలా ఉండగా... కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఈ బ్యూటీ... 2017 లోనే ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. కానీ తెలుగులో మాత్రం చూసి చూడంగానే అనే సినిమాతో 2020లో... అడుగుపెట్టింది హీరోయిన్ వర్ష బొల్లమ్మ. ఆ తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీస్ , పుష్పక విమానం, స్వాతిముత్యం అలాగే భైరవకోన లాంటి సినిమాలతో బాగా పాపులర్ అయింది ఈ బ్యూటీ.



Next Story

Most Viewed