- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జీవితం అద్భుతాలు, ఆశ్చర్యాలతో నిండి ఉందంటూ హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనుపమ్ ఖేర్(Anupam Kher) తెరకెక్కించిన ‘తన్వి ది గ్రేట్’(Tanvi the Great).

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనుపమ్ ఖేర్(Anupam Kher) తెరకెక్కించిన ‘తన్వి ది గ్రేట్’(Tanvi the Great). శుభాంగి దత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో జాకీ ష్రాఫ్(Jackie Shroff), అరవింద స్వామి, పల్లవి జోషి(Pallavi Joshi), నాజర్, బొమన్ ఇరానీ కీలక పాత్రలో కనిపించనున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 18న థియేటర్స్‌లోకి రాబోతుంది. దీంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీ అయిపోయారు. తాజాగా, ‘తన్వి ది గ్రేట్’ చిత్రబృందం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu)తో భేటీ అయ్యారు. రాష్ట్రపతి భవన్‌లో ఆమె కోసం ‘తన్విది గ్రేట్’ మూవీని ప్రదర్శించగా.. ముర్ముతో కలిసి టీమ్ అంతా చూశారు. ఇక ఈ విషయాన్ని తెలుపుతూ శుభాంగి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు.
‘‘హృదయపూర్వకంగా రాసిన కథ రాష్ట్రపతి భవన్ హాళ్లలో ప్రతిధ్వనించింది. తన్వి ది గ్రేట్ ప్రయాణం పట్టుదలతో కూడుకున్నది. భారత త్రివిధ దళాల అధిపతి సుప్రీం కమాండర్ ద్రౌపది ముర్ము మా సినిమాను చూడడం మాకు గర్వంగా ఉంది. సినిమా పూర్తయ్యాక చివర్లో ఆమె చప్పట్లు కొట్టడంతో పాటు అద్భుతంగా తీశారంటూ చెప్పడం సంతోషంగా అనిపించింది. జీవితం అద్భుతాలు, ఆశ్చర్యాలతో నిండి ఉంది. అసుపమ్ సర్ మీ దార్శనికథ, ధైర్యసాహసాలు, దయ ప్రతిదీ ఈ సినిమాను ఇంత మంచిగా వచ్చేలా చేశాయి. మా అద్భుతమైన టీమ్ అంతా కూడా కలిసి పని చేశారు’’ అని రాసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక అది చూసిన నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు.






