- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మామ మాటిచ్చాడు.. జెనీలియా ఎమోషనల్ పోస్ట్
దిశ, సినిమా : జెనీలియా అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చే క్యారెక్టర్ 'హా హా.. హసిని'.

దిశ, సినిమా : జెనీలియా అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చే క్యారెక్టర్ 'హా హా.. హసిని'. బొమ్మరిల్లు చిత్రంలో చిన్నపిల్ల మనస్తత్వంతో కూడిన అల్లరి పాత్రలో చక్కని నటన కనబరిచి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. తాజాగా తను చేసిన పోస్ట్ ఒకటి వైరల్ అవుతోంది. విషయానికొస్తే.. జెనీలియా తన మామ విలాస్ రావ్ దేశ్‌ముఖ్‌ను తండ్రిలా భావించడమే కాక 'పప్ప' అని పిలుస్తుంది.
రీసెంట్‌గా ఆమె ఇద్దరు పిల్లలు తాతయ్యను మేం ఓ ప్రశ్న అడిగితే.. ఆయన సమాధానం చెబుతారా? అని జెనీలియాను అడిగారట. అయితే మనసుతో వింటే ఆయన ప్రతి దానికి సమాధానం ఇస్తారంటూ.. 'మా కోసం మీరు ఎప్పుడూ ఉంటారని మాటిచ్చారు. కళ్లు తెరిచి.. మనసుతో వింటే.. మీ మాటలు మాకు వినిపిస్తుంటాయి.. వి మిస్ యు పప్పా. మీ ఫొటోను రియాన్, రహైల్ ఇద్దరూ చెరోవైపు గట్టిగా పట్టుకుని ఉన్నారు' అంటూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.
మోహన్‌లాల్‌కు సంకెళ్లు వేసిన పోలీసులు.. 'దృశ్యం 3' ఫస్ట్ లుక్






