- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విజయ్ సేతుపతి-పూరి జగన్నాథ్ సినిమాలో హీరోయిన్ ఫిక్స్.. ఆమె కళ్లలో ఫైర్ ఉందంటూ పోస్ట్‌తో హైప్ పెంచిన మేకర్స్
యంగ్ హీరోయిన్ సంయుక్త మీనన్(Samyuktha Menon) ‘పాప్‌కార్న్’(Popcorn) మూవీతో ఇండస్ట్రీకి వచ్చింది.

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ సంయుక్త మీనన్(Samyuktha Menon) ‘పాప్‌కార్న్’(Popcorn) మూవీతో ఇండస్ట్రీకి వచ్చింది. ఇక తెలుగులో మొట్టమొదటి సినిమానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ‘భీమ్లా నాయక్’ లో నటించింది. ఆ తర్వాత సార్, వీరూపాక్ష, బింబిసార. వంటి చిత్రాల్లో నటించిన సంయుక్త అనతి కాలంలోనే ఫుల్ ఫేమ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ ఫామ్‌లో ఉంది. తెలుగులో ఇప్పటికే అఖండ-2, స్వయంభు(Swayambhu) వంటి పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా, సంయుక్త మీనన్ ఓ బంపర్ ఆఫర్ అందుకుంది.
ఈ విషయాన్ని ప్రకటిస్తూ మూవీ మేకర్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రిలీజ్ చేశారు. పూరి జగన్నాథ్(Puri Jagannath), మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi)కాంబినేషన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్‌లో సంయుక్త భాగం అయింది. ఈ మేరకు పూరిజగన్నాథ్ ఆమెకు స్వాగతం పలుకుతూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఫొటోను షేర్ చేశారు. ఇక ఈ పోస్ట్‌కు ‘‘ఆమె అడుగులో దయ, కళ్ళలో ఫైర్ ఉంది’’ అనే క్యాప్షన్ జత చేసి అంచనాలను పెంచేశారు.
అయితే విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ కాంబోలో రాబోతున్న మొదటి ప్రాజెక్ట్ కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో పూరి జగన్నాథ్, ఒకప్పటి హీరోయిన్ చార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఇందులో టబు, రాధికా ఆప్టే కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ సినిమాకు ‘బెగ్గర్’ అనే టైటిల్ పెట్టాలని మూవీ టీమ్ భావిస్తున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. కానీ దీనిపై చిత్రబృందం ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.






