అవకాశం వస్తే రొమాన్స్ చేసి నీ కోరికలన్నీ తీరుస్తానంటూ.. నటికి షాకిచ్చిన హీరో నవదీప్

by Hamsa |
అవకాశం వస్తే రొమాన్స్ చేసి నీ కోరికలన్నీ తీరుస్తానంటూ.. నటికి షాకిచ్చిన హీరో నవదీప్
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో నవదీప్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. జై సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన ఆయన సహాయక క్యారెక్టర్లు కూడా చేసి మెప్పించాడు. ప్రస్తుతం నవదీప్ లవ్ మౌళీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ క్రమంలో నవదీప్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భాగంగా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. బుల్లితెర నటి రితూ చౌదరి యాంకర్‌గా వ్యవహరిస్తున్న దావత్ షోకు నవదీప్ హాజరయి.. రితౌ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి ఎంటర్‌టైన్ చేశాడు. ఇందులో భాగంగా రితూ.. మీరు క్యారక్టర్ రోల్స్‌లో కాకుండా హీరోగా మరిన్ని సినిమాలు చేస్తే చూడాలని ఉంది.

అలాగే మిమ్మల్ని రొమాంటిక్ పాత్రల్లో, రొమాంటిక్ హీరోగా చూడాలని ఉంది అని అంటుంది. దానికి నవదీప్.. అవకాశం వస్తే కచ్చితంగా చేస్తాను. రొమాంటిక్ చిత్రాలు చేసి నీ కోరికలన్నీ తీరుస్తానంటూ చెప్పుకొచ్చాడు. దీంతో రితూ సిగ్గుపడిపోయి ఇతర ప్రశ్నలు వేసింది. అలాగే పలు ఫన్నీ గేమ్స్.. టాస్కులు ఇచ్చింది. ప్రస్తుతం దావత్ షోలో నవదీప్ చేసిన కామెంట్స్ నెట్టింట సెన్సేషన్‌గా మారాయి. కటింగ్ వీడియోలు వైరల్ కావడంతో నవదీప్ కావాలనే ఇండైరెక్ట్‌గా రితౌ చౌదరితో అలా మాట్లాడానని అంతా చర్చించుకుంటున్నారు.

Read More..

జీవితం పర్‌ఫెక్ట్‌గా లేదంటూ నరేష్ ఆసక్తికర ట్వీట్.. పవిత్ర లోకేష్‌తో గొడవలే కారణమా?

Next Story

Most Viewed