హీరో దళపతి విజయ్ సినిమాలో స్టార్ క్రికెటర్

by Dishafeatures1 |
హీరో దళపతి విజయ్ సినిమాలో స్టార్ క్రికెటర్
X

దిశ, సినిమా: ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల సినిమాల్లో.. అతిథి పాత్రల్లో ఊహించని వారు ఎంట్రీ ఇస్తున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా భాషతో సంబంధం లేకుండా గెస్ట్ రోల్‌ అని.. విలన్‌ రోల్ అని కనిపిస్తున్నారు. ఇక తాజాగా ఇలాంటి వార్త ఒకటి వైరల్ అవుతుంది. ఏంటి అంటే.. ఒక స్టార్ హీరో సినిమాలో క్రేజీ సెలబ్రిటీ అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు. క్రేజీ సెలబ్రిటీ అంటే మరో స్టార్ హీరో అనుకుంటున్నారు అంటే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే అతిథి పాత్రలో కనిపించబోయేది స్టార్ హీరో కాదు.. స్టార్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని.

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ప్రస్తుతం విజయ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ అనే మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ మూవీపై రోజు రోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి . అయితే తాజాగా ఈ సినిమాలో భారత మాజీ క్రికెటర్ మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని అతిథి పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ మూవీలో క్రికెట్‌కు సంబంధించిన సన్నివేశాలు ఎంతో కీలకంగా ఉంటాయని.. ఈ సన్నివేశాల కోసం గాను టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కనిపిస్తారని ఒక వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Next Story

Most Viewed