- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంబానీ ఇంట్లో పెళ్లి సందడి.. ఈ హీరోకు కరోనా పాజిటివ్!
అపర కుభేరుడు అంబానీ ఇంట పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. తన కుమారుడు అనంత్ అంబానీ వివాహాన్ని అంబానీ ఘనంగా జరుపుతున్నాడు. దీంతో ఈ పెళ్లి వేడుకలకు ఎంతోమంది టాలీవుడ్, బాలీవుడ్

దిశ, సినిమా : అపర కుభేరుడు అంబానీ ఇంట పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. తన కుమారుడు అనంత్ అంబానీ వివాహాన్ని అంబానీ ఘనంగా జరుపుతున్నాడు. దీంతో ఈ పెళ్లి వేడుకలకు ఎంతోమంది టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ నుంచి నటీనటులు హాజరై, సందడి చేశారు. దాదాపు 2500 మందికి పైగా ముఖ్య అతిథులు ఈ వేడుకకు హాజరైనట్లు సమాచారం.
ముఖ్యంగా బాలీవుడ్ నుంచి చాలా మంది స్టార్స్ అంబానీ ఇంట వివాహ వేడుకకు హాజరు అయ్యారు. కానీ బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్ మాత్రం వివాహ వేడుకలో ఎక్కడా కనిపించేలేదు. దీంతో అతని ఫ్యాన్స్ కాస్త అసహనానికి గురి అవుతున్నారు. అయితే ఆయన పెళ్లికి హాజరు కాకపోవడానికి ఓ కారణం ఉన్నదంట. అక్షయ్ కుమార్‌కు కరోనా పాజిటివ్ రావడంతో ఆయన సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలస్తుంది. ఆయన తాజాగా నటించిన సర్ఫిరా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పలు ప్రాంతల్లో పర్యటించడం వలన ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చిందంట.






