నాకు ఆయనే సర్వస్వం.. ఆ బాధ వర్ణించలేనంటూ హేమమాలిని ఎమోషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |

బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ ధర్మేంద్ర(Dharmendra) మూడు రోజుల క్రిత్రం కన్నుమూశారు.

నాకు ఆయనే సర్వస్వం.. ఆ బాధ వర్ణించలేనంటూ హేమమాలిని ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ ధర్మేంద్ర(Dharmendra) మూడు రోజుల క్రిత్రం కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కొన్నాళ్ల క్రితమే చనిపోయారని వార్తలు వచ్చినప్పటికీ వాటిని కుటుంబ సభ్యులు ఖండించారు. కానీ సోమవారం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన మరణించారు. శ్వాసకోశ సమస్యలతో మృతి చెందినట్లు సమాచారం. తాజాగా, ధర్మేంద్ర భార్య హేమమాలిని (Hema Malini)సోషల్ మీడియా ద్వారా తన బాధను వ్యక్తపరుస్తూ పోస్ట్ పెట్టింది.

‘‘నా జీవితంలో అన్నీ ధర్మేంద్రనే అనుకున్నాను. భార్యను అమితంగా ప్రేమించే భర్త, పిల్లల్ని బాధ్యతగా చూసుకునే తండ్రి. మంచి స్నేహితుడు, మార్గదర్శకుడు, గొప్ప కవి ఆయన. ఇలా అన్ని ఆయనే. నా కష్టసుఖాల్లో తోడుగా ఉన్నాడు. కుటుంబమూ సర్వస్వం అనుకుని బతికాడు. నటుడిగా ఆయన ప్రతిభ ఆయనను లెజెండ్‌ని చేసింది. ఆయన కీర్తి ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతుంది. ఇక వ్యక్తిగతంగా నాకు ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేరు. ఆయన లేరన్న బాధను నేను వర్ణించలేను.

ధర్మేంద్రతో కలిసి జీవించిన క్షణాలు నాకు ఎప్పటికీ ప్రత్యేకమే. నాకు ఆయన లెక్కలేనన్ని జ్ఞాపకాలు ఇచ్చారు’’ అని రాసుకొచ్చింది. అలాగే కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇక నెటిజన్లు ఆమెకు ధైర్యం చెబుతున్నారు. మేమంతా మీతో ఉన్నామని కామెంట్లు పెడుతున్నారు.కాగా.. ధర్మేంద్రకు హేమమాలిని రెండో భార్య. వీళ్లకు ఈషా డియోల్, అహనా డియోల్ ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఇక ధర్మేంద్ర మొదటి భార్య సంతానం సన్నీ డియోల్, బాబీ డియోల్. వీరిద్దరు తండ్రిలాగే సినిమాల్లో నటిస్తూపాపులారిటీ పెంచుకుంటున్నారు.

Next Story