‘కింగ్‌డమ్’ సినిమాకు నెగెటివ్ టాక్ రావడానికి కారణం ఆయనే.. షాకింగ్ విషయాలు చెప్పిన నాగవంశీ

by Mallepaka Hamsa |   (  Updated:2025-12-28 05:39:47  IST  )

రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన మూవీ ‘కింగ్‌డమ్’(Kingdom).

‘కింగ్‌డమ్’ సినిమాకు నెగెటివ్ టాక్ రావడానికి కారణం ఆయనే.. షాకింగ్ విషయాలు చెప్పిన నాగవంశీ
X

దిశ, సినిమా: రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన మూవీ ‘కింగ్‌డమ్’(Kingdom). గౌతమ్ తిన్ననూరి(Gowtham Tinnanuri) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మించారు. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా ఫ్లాప్ టాక్‌ను తెచ్చుకుంది. అంతేకాకుండా విమర్శలు వచ్చాయి. బడ్జెట్ పరంగా బాగానే ఖర్చు చేసినప్పటికీ లాభాలు మాత్రం రాలేదు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగవంశీ(Nagavamsi) ‘కింగ్‌డమ్’ ఫ్లాన్ అవడానికి కారణాలెంటో చెప్తూ.. షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘‘ఈ మూవీ మేము ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. కొన్ని సీన్స్ విషయంలో దర్శకుడు గౌతమ్‌తో మాకు భిన్నాభిప్రాయాలు వచ్చాయి. ముఖ్యంగా సత్యదేవ పాత్ర చనిపొయే సన్నివేశం తర్వాత విజయ్

మరో అమ్మాయితో పడుకున్నట్లుగా చూపించారు. ఆ సీన్‌ను జనాలు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆ సీన్ తీసేయమని చెప్పినా నేను వేరే కోణంలో ఆలోచిస్తున్నా అని చెప్పి గౌతమ్ వినలేదు. ఆ సీన్‌కి బదులుగా.. మేము హీరోయిన్‌, విజయ్‌కి డ్రగ్ ఇచ్చి అతా చేసినట్లుగా చూపించమని చెప్పాను. అయినప్పటికీ దర్శకుడు వినిపించుకోకుండా.. అది అలాగే ఉంచేశారు. నేను ఆ సీన్ ‘కింగ్‌డమ్’ ఫ్లాప్ కావడానికి కారణం అని అనుకుంటున్నాను. ఆడియెన్స్ ఆ సీన్‌ను మరోలా అర్థం చేసుకోవడంతో.. ఆ ఎఫెక్ట్ సినిమాపై పడింది’’ అని చెప్పుకొచ్చారు. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు నాగవంశీకి సపోర్ట్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ‘కింగ్‌డమ్’ కథ పరంగా కనెక్ట్ అయినప్పటికీ కొన్ని సీన్స్ కారణంగానే తొలిరోజు నుంచే నెగెటివ్ టాక్‌ను తెచ్చుకుందని అంటున్నారు. దీని ఎఫెక్ట్ విజయ్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ వారిపై బాగానే పడింది.

Read More..

ఆ హీరోయిన్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన ప్రభాస్.. నాకు చాలా స్పెషల్ అంటూ ఎమోషనల్ కామెంట్స్

Next Story