- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > అతనొక ‘బెస్ట్ ల్యాండ్ లార్డ్’.. సతీష్ కౌశిక్‌కు కార్తిక్ భావోద్వేగ నివాళి
అతనొక ‘బెస్ట్ ల్యాండ్ లార్డ్’.. సతీష్ కౌశిక్‌కు కార్తిక్ భావోద్వేగ నివాళి
బాలీవుడ్ నటుడు కార్తిక్ ఆర్యన్ ప్రముఖ నిర్మాత, దివంగత నటుడు సతీష్ కౌశిక్‌ను తలచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.

X
దిశ, సినిమా: బాలీవుడ్ నటుడు కార్తిక్ ఆర్యన్ ప్రముఖ నిర్మాత, దివంగత నటుడు సతీష్ కౌశిక్‌ను తలచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ మేరకు బాలీవుడ్ ఇండస్ట్రీలో అతను అందరికీ ఉత్తమ భాగస్వామిగా పేర్కొంటూ సతీష్ కష్టపడ్డ రోజులను గుర్తుచేసుకున్నాడు. అంతేకాదు అతనొక ‘బెస్ట్ ల్యాండ్ లార్డ్’ అంటూ సోషల్ మీడయా వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసిన కార్తిక్..
‘ఒక గొప్ప నటుడు. ఉన్నతమైన మనిషి. బెస్ట్ ల్యాండ్ లార్డ్. నేను ముంబై నగరంలో అడుగుపెట్టినపుడు మీరు కష్టపడుతున్న రోజుల్ని దగ్గరి నుంచి చూశాను. మీ ప్రోత్సాహకరమైన మాటలు, నవ్వు ఎప్పుడూ గుర్తుంచుకుంటాను సార్. RIP సతీష్ సార్’ అంటూ నివాళులు అర్పించాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా పలువురు సెలబ్రిటీలు సతీష్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు.
Also Read..
Next Story






