- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ డైరెక్టర్ ఒక లెజెండ్.. కలిసి పని చేయడం గ్రేట్ ఎక్స్‌పీరియన్స్: విజయ్ సేతుపతి
కోలీవుడ్ మక్కల్ సెల్వన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల ‘తలైవాన్.. తలైవి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

దిశ, సినిమా: కోలీవుడ్ మక్కల్ సెల్వన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల ‘తలైవాన్.. తలైవి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో నిత్యామీనన్ హీరోయిన్‌గా నటించగా.. పాండిరాజ్ దర్శకత్వం వహించారు. ఈ రొమాంటిక్ యాక్షన్ కామెడీ చిత్రం జులై 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక తెలుగులో ‘సార్.. మేడమ్’ పేరుతో రాబోతుంది. ఆగస్టు 1న థియేటర్స్‌లోకి రానుంది. ఇదిలా ఉంటే.. తెలుగులో విజయ్ సేతుపతి(Vijay Sethupathi) ఓ భారీ ప్రాజెక్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు పూరి జగన్నాథ్(Puri Jagannath) దర్శకత్వం వహిస్తుండగా.. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, టాలీవుడ్ హీరోయిన్ చార్మీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి సరసన యంగ్ బ్యూటీ సంయుక్త మీనన్ (Samyuktha Menon)నటిస్తుండగా.. విజయ్ కుమార్, టబు, రవీనా టాండన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.
షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తాయా? అని ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో.. తాజాగా, ఓ ఈవెంట్‌లో పాల్గొన్న విజయ్ సేతుపతి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘‘పూరి జగన్నాథ్ ఒక లెజెండ్. ఆయనతో కలిసి పని చేయడం గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. పూరితో పని చేయడాన్ని ప్రతిరోజూ ఎంజాయ్ చేస్తున్నాను. డైలాగులు రాసే విధానం, వాటిని ఎగ్జిక్యూట్ చేసే విధానం అలాగే ఆయన టైమింగ్ నాకు చాలా ఇష్టం. సినిమా కూడా బాగా వస్తుంది’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






