ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హనుమాన్ టీం.. అయోధ్యకు భారీగా విరాళం..

by Malleboina Mahesh |   (  Updated:2024-01-25 04:25:54  IST  )

ఇటీవల ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదలైన హనుమాన్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హనుమాన్ టీం.. అయోధ్యకు భారీగా విరాళం..
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదలైన హనుమాన్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలతో నిలిచిన ఈ చిన్న సినిమా భారీ కలెక్షన్లతో బాక్సాఫీస్ ను షేక్ చేసింది. తక్కువ థియోటర్లు ఉన్నప్పటికీ రోజు రోజుకు కలెక్షన్లను పెంచుకుంటూ వందకోట్ల క్లబ్ లో చేరిపోయింది. అయితే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా.. హనుమాన్ సినిమా ఒక్క టికెట్ పై ఐదు రూపాయలను అయోధ్యకు విరాళంగా ఇస్తామని మూవీ టీం ప్రకటించింది. అందరూ ఊహించినట్లుగానే సినిమా భారీ విజయాన్ని అందుకుని.. మంచి వసూళ్లను రాబడుతోంది.

ఈ క్రమంలో రేపు అయోధ్యలో శ్రీరాముని 'ప్రాణ ప్రతిష్ఠ' వేడుక సందర్భంగా.. రామమందిర ప్రారంభానికి రూ. 2.66 కోట్ల రూపాయలను విరాళంగా అందించారు. దీంతో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్ర బృందానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. అలాగే ఈ సినిమా రానున్న రోజుల్లో మరిన్ని ధియోటర్లలో ఆడే అవకాశం ఉంది. ఈ క్రమంలో వసూళ్లు కూడా భారీగా పెరుగుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Next Story