Guppedantha Manasu: మనుని దత్తత తీసుకుంటున్న మహేంద్ర

by Disha Web Desk 10 |
Guppedantha Manasu:  మనుని దత్తత తీసుకుంటున్న మహేంద్ర
X

దిశ, సినిమా: గుప్పెడంత మనసు ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్

ఒక్కసారి ఆలోచించండి మామయ్యా అని వసుధార అని అంటుంది. ‘లేదమ్మా.. అనుపమని నేను అడిగాను.. కానీ తను ఏం చెప్పడం లేదు. ఎంత అడిగిన నిజం మాత్రం బయటకు రావడం లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా.. అనుపమ చెప్పిన వెంటనే.. మను తండ్రి ఎక్కడా ఉన్నా.. తన ముందు నిలబెడతా అని అంటాడు మహేంద్ర. ఈ సీరియల్ చూసే ప్రేక్షకులు.. కనిపించకుండా పోయిన నీ కొడుకు రిషిని వెతుకు ముందు.. నిన్న కాక మొన్న వచ్చిన మను తండ్రి గురించి అడుగుతున్నాడని మనసులో అనుకోకుండా అయితే ఉండరు. ఏమి మాట్లాడాలో తెలియక వసుధార సైలెంట్ గా ఉంటుంది.

అవును వసుధార.. మను తండ్రి తిరిగి వచ్చే వరకూ నేనే అతనికి తండ్రిగా ఉంటానని మహేంద్ర అంటాడు. మను ఏమైనా చిన్న పిల్లవాడా.. చూసే వాళ్ళకి నరాలు కట్ అయిపోయేలా మాట్లాడతాడు. ఇంట్లో వాళ్ళ అందరికి మనుని దత్తత తీసుకుంటున్నాని చెప్తాడు. ఫణీంద్ర ఫామిలీ మొత్తం షాక్ అవుతారు. ‘ఏంటి బాబాయ్ ఇదీ.. మనుని దత్తత తీసుకోవడం ఏంటి.. ఇంక రిషిని వదిలిపెట్టేసినట్టేనా? అని అడుగుతాడు శైలేంద్ర. అప్పుడు మహేంద్ర.. ‘రిషి నా కొడుకు.. తనని ఎలా వదిలేస్తా.. ఏం మాట్లాడుతున్నావ్’ అని అంటాడు. ఇక్కడితో ఈ సీన్ ముగుస్తుంది.

Next Story

Most Viewed