Guppedantha Manasu: హీటెక్కించే సీన్.. వసు పెదవులపై ముద్దు పెట్టిన రిషి

by Disha Web Desk 10 |
Guppedantha Manasu: హీటెక్కించే సీన్.. వసు పెదవులపై ముద్దు పెట్టిన రిషి
X

దిశ,వెబ్ డెస్క్: గుప్పెడంత మనసు ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్

సార్ మీరు నా పక్కన ఉన్నప్పుడు నాకు మీ ఆలోచనే తప్పా వేరే వాటి గురించి కానీ నా కోసం కూడా నేను ఆలోచించలేను అని వసు అంటుంది. ‘నన్ను ఇంతగా ప్రేమించే నిన్ను చాలా సార్లు బాధపెట్టాను కదా?’అని రిషి అంటాడు. ‘సార్ ఇప్పుడు మనమిద్దరం పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నాం.. అవన్నీ ఎందుకు సార్? అయినా మీరు నా మీద ప్రేమతోనే అలా చేశారని నాకు తెలుసు..’ అని అంటుంది వసు.

‘ఒక్కోసారి బయటవాళ్లు తప్పుబడుతూ ఉంటారు. కొందరు నన్ను స్వార్థపరురాలు అంటారు. ఇంకొందరు మిమ్మల్ని ఇగోయిష్టు అంటారు. కానీ మనల్ని వేలెత్తి చూపించే ఎవరికీ తెలియదు.. ప్రేమించిన వాళ్లకు వాళ్ల ప్రేమ తప్ప ఇంకేం కనిపించదని’ వసు అంటుంది. ‘నిజమే వసుధార.. ఎవరి తెలిస్తే ఏంటీ తెలియకపోతే ఏంటీ? మన ప్రేమ మన అంతరాత్మకు తెలుసు..’ అంటాడు రిషి. ‘ఐ లవ్యూ సార్’ అంటుంది వసు. వెంటనే రిషి కౌగిలించుకుంటాడు. ఆ ఆనందంలోనే ఇద్దరూ పై నుంచి పడే జలపాతాలను చూస్తూ.. ఆ నీళ్లలో ఆడుతూ ఉంటారు. తడిచిన ఇద్దరూ ఒకరితో ఒక్కరు చాలా ఇష్టంగా ఉంటారు. ఉన్నట్టుండి రిషికి దగ్గరగా వెళ్తుంది వసు. అప్పుడే రిషి రొమాంటిక్‌గా ఫీల్ అయ్యి.. వసు పెదవులపై ముద్దు పెడతాడు. ఎన్ని రోజుల నుంచో వెయిట్ చేస్తున్నఈ సీన్ అభిమానులకు పండగ లాగే ఉంటుంది.



Next Story

Most Viewed