‘గుంటూరు కారం’ రివ్యూ.. మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు మాస్ జాతర..

by Disha Web Desk 7 |
‘గుంటూరు కారం’ రివ్యూ.. మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు మాస్ జాతర..
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన తాజా సినిమా ‘గుంటూరు కారం’. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ.. భారీ అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు రానే వచ్చింది. ఇక మొదటి షోతోనే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది. రమణ పాత్రకు మహేశ్ బాబు 100 కు 200 శాతం న్యాయం చేశాడంటూ నెట్టింట రచ్చ చేస్తున్నారు.

ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందట.. మహేష్ బాబు కామెడీ టైమింగ్, కుర్చీ మడతపెట్టి సాంగ్, క్లైమాక్స్ ఎమోషనల్ సీన్స్‌ హైలెట్.. అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు వన్ మెన్ షో.. నవీన్ నూలి ఎడిటింగ్ వండర్ ఫుల్‌గా ఉందని చెప్తున్నారు. ఇక శ్రీలీల ఎప్పటి లాగే డాన్స్‌తో అదరగొట్టిందని, వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ కూడా బాగుందని X వేదికగా రివ్యూలు ఇస్తున్నారు. ఇక ఓవరల్‌గా బొమ్మ హిట్టని.. బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ అంటూ ట్విట్టర్‌లో పోస్టులతో మోత మోగిస్తున్నారు. ఇక థియేటర్ల వద్ద అయితే.. మహేశ్ బాబు భారీ కట్అవుట్‌లతో మాస్ జాతర షూరు చేస్తున్నారు ఫ్యాన్స్.



Next Story

Most Viewed