- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వైసీపీకి షాక్.. రాజధాని ఫైల్స్ సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్
by GSrikanth |

X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ఫైల్స్ సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఈ సినిమా విడుదలపై హైకోర్టు విధించిన స్టేను శుక్రవారం ఎత్తివేసింది. అభ్యంతరకర సన్నివేశాలు ఎత్తివేశామని సెన్సార్ బోర్డు వాదనలను కోర్టు ఏకీభవించింది. అయితే ఈ చిత్రం విడుదలను నిలిపివేయాలంటూ వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు గురువారం కోర్టు స్టే విధించింది.
ఇవాళ మరోసారి విచారణకు రాగా.. స్టే కొనసాగించేందుకు ధర్మాసనం తిరస్కరించింది. నిరభ్యంతరంగా సినిమాను విడుదల చేసుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో రాజధాని ఫైల్స్ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర నిర్వహకులు సన్నాహాలు చేపట్టారు. కాగా, ఈనెల 15న సినిమా విడుదల కావాల్సి ఉండగా.. హైకోర్టు స్టే విధించడంతో విడుదల ఆగిపోయిన విషయం తెలిసిందే.
Next Story