విజయ్ అభిమానులు గుడ్ న్యూస్.. ఆ పండుగకు ‘జన నాయగన్’ ఫస్ట్ సింగిల్

by Mallepaka Hamsa |

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (vijay) గత ఏడాది ‘గోట్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.

విజయ్ అభిమానులు గుడ్ న్యూస్.. ఆ పండుగకు ‘జన నాయగన్’ ఫస్ట్ సింగిల్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (vijay) గత ఏడాది ‘గోట్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ఆయన ‘జన నాయగన్’(Jana Nayagan) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. త్వరలో రాజకీయాల్లోకి రాబోతుండటంతో ఈ ప్రాజెక్ట్ ఆయన సినీ కెరీర్‌లోనే చివరి సినిమాగా రాబోతోంది. దీంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి హెచ్. వినోద్(H. Vinod) దర్శకత్వం వహిస్తుండగా.. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో విజయ్ సరసన పూజా హెగ్డే(Pooja Hegde) హీరోయిన్‌గా నటిస్తుండగా.. మమిత బైజు, ప్రియమణి, శృతి హాసన్, బాబీ డియోల్, మోనిషా బ్లెస్సీ, జోసెఫ్ విజయ్, గౌతమ్ మీనన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 9న థియేటర్స్‌లోకి రాబోతుంది. దీనికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. కానీ మరే అప్డేట్ రాలేదు. దీంతో విజయ్ అభిమానులు నిరాశ చెందుతున్నారు. ‘జన నాయగన్’ అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన పలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. అభిమానులను సంతోష పెడుతున్నాయి. ‘జన నాయగన్’ ఫస్ట్ సింగిల్ దీపావళి కానుకగా రాబోతున్నట్లు టాక్. ఇక ఇందులో విజయ్‌తో పూజా హెగ్డే, మమిత బైజు చిందులేయబోతున్నట్లు తెలుస్తోంది.

Next Story