Samantha ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. శాకుంతలం సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్

by Disha Web Desk 6 |
Samantha ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. శాకుంతలం సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు పరిచయం అవసరం లేదు. తన అందం, నటనతో నెంబర్ వన్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. అయితే సమంత, గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం' సినిమా తెలకెక్కుతున్న విషయం తెలిసిందే. మహాభారతం ఆదిపర్వంలోని శకుంతల, దుశ్యంతుడి ప్రేమ కథ ఆధారంగా రూపొందిస్తున్నారు.

అయితే ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేశాయి. దీంతో 'శాకుంతలం' రిలీజ్ డేట్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు చిత్రబృందం అధికారికంగా గుడ్ న్యూస్ తెలిపింది. నవంబర్ 4న ఈ సినిమాను థియేటర్స్‌లోకి తీసుకొస్తునట్టు ఓ వీడియోను కూడా షేర్ చేశారు. దీంతో అది చూసిన అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి :

Sam - Chaitu విడాకులు తీసుకున్నందుకు పార్టీ ఇచ్చిన స్టార్ హీరో.. ఎందుకంత ఇంట్రెస్ట్?


Next Story

Most Viewed