మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. విశ్వంభర రిలీజ్ అయ్యేది అప్పుడేనా..?

by I. Sairam |

విశ్వంభర మూవీ రిలీజ్ డేట్ పై క్లారిటీ రావడంతో మెగా ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.

మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. విశ్వంభర రిలీజ్ అయ్యేది అప్పుడేనా..?
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ప్రజెంట్ ‘మన శంకరవరప్రసాద్‌ గారు’(Mana Shankar Varaprasad Gaaru) మూవీతో మన ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. సంక్రాంతి కానుకగా ఈ మూవీ ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో క్యాథరిన్, నయనతార(Nayanthara) హీరోయిన్లుగా నటిస్తుండగా.. స్టార్ హీరో విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) కీ రోల్ ప్లే చేయనున్నారు. ఇక చిరు ఈ సినిమాతో పాటు ‘విశ్వంభర’(Vishwambhara) మూవీలో కూడా నటిస్తున్నాడు.

ఇది వశిష్ట(Vasista) దర్శకత్వంలో తెరకెక్కుతుండగా.. యూవీ క్రియేషన్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. అయితే ఇప్పటికే ఈ మూవీ షూటింగ్‌ పూర్తయి చాలా రోజులైంది. దీంతో ఈ చిత్రం సంక్రాంతి బరిలో వస్తుందని అందరూ అంచనా వేశారు. అయితే కథరీత్యా వీఎఫ్‌ఎక్స్‌కు చాలా ప్రాధాన్యత ఉండటంతో మేకర్స్‌ ఆ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ మేరకు ఈ మూవీ రిలీజ్‌కు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది.

వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం.. జూన్‌లో ఈ చిత్రం రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. అందుకు తగినట్లుగా మేకర్స్‌ ప్రయత్నాలు చేస్తున్నారని, ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ రిలీజ్‌ తర్వాత చిరంజీవి ‘విశ్వంభర’ సినిమా ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టబోతున్నారని ఫిల్మ్‌ నగర్‌ టాక్‌. కాగా బాబీ కొల్లి దర్శకత్వంలో ‘మెగా 158’ వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కనున్న ఓ సినిమాలో కూడా చిరు సినిమా చేస్తున్నాడు.

Next Story