అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే ‘పుష్ప 2’ నుంచి సెకండ్ సాంగ్!

by Disha Web Desk 7 |
అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే ‘పుష్ప 2’ నుంచి సెకండ్ సాంగ్!
X

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ ‘పుష్ప 2’. ‘పుష్ప: ది రైజ్’ కు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంపై అభిమానులతో సహా, సినీ ప్రియుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఇందులో నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి అప్‌డేట్ ఎంతో ఆకట్టుకోగా.. టీజర్‌కు విశేష స్పందన రావడంతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ వన్‌గా నిలిచింది. దాంతో పాటు ఇటీవల వచ్చిన ఫస్ట్ సింగిల్ ‘పుష్ప పుష్ప’ సాంగ్‌కు కూడా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది.

ఇప్పటికే ఈ సాంగ్ మిలియన్ల వ్యూస్ రాబడుతూ దూసుకుపోతుంది. ఇదే క్రేజ్‌తో ఇప్పుడు సెకండ్ సాంగ్‌కు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అయితే.. రెండో పాటగా ఓ రొమాంటిక్ సాంగ్‌ను రిలీజ్ చేయనున్నారట మేకర్స్. మరి అల్లు అర్జున్, రష్మికపై వచ్చే ఈ రొమాంటిక్ సాంగ్‌కు రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు చూడాల్సిందే. కాగా ఈ సినిమా ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed