- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
God Father Update 'తార్ మార్ తక్కర్ మార్' అంటూ స్టెప్పులేసిన చిరంజీవి, సల్మాన్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, మోహన్ రాజా డైరెక్షన్లో తెరకెక్కబోతున్న సినిమా 'గాడ్ ఫాదర్'.

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి హీరోగా, మోహన్ రాజా డైరెక్షన్లో తెరకెక్కబోతున్న సినిమా 'గాడ్ ఫాదర్'. మలయాళంలో సూపర్ హిట్ అయిన 'లూసీఫర్' మూవీకి రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా ప్రస్తుతం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈ క్రమంలో మూవీ నుండి ఒక్కో అప్డేట్ను విడుదల చేస్తున్నారు చిత్రబృందం.
తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్డేట్ వచ్చేసింది. గాడ్ ఫాదర్ నుంచి 'తార్ మార్ తక్కర్ మార్' అంటూ సాగే మొదటి సాంగ్‌ను ఈ నెల 15న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా పాట ప్రోమోను మంగళవారం రిలీజ్ చేశారు. విడుదల చేసిన తక్కువ టైంలోనే ఓ రేంజ్లో వైరల్ అవుతుంది. ముఖ్యంగా ఈ ప్రోమోలో చిరంజీవి, సల్మాన్ ఖాన్ ఎంట్రీ అభిమానులను ఆకట్టుకుంటుంది. కాగా, ఈ సినిమా దసరాకు ప్రేక్షకుల ముందు సందడి చేయనుంది.
ఫస్ట్ తమిళ్ హీరోగా ధనుష్ రికార్డ్
'బ్రా' లేకుండానే బయటకొచ్చిన Radhika Madan.. పిచ్చెక్కిస్తున్న పిక్స్






