- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'పేరులేని ఊరులోకి'.. ఆకట్టుకుంటున్న 'బుట్ట బొమ్మ' ఫస్ట్ సాంగ్!
by Chukka Sudharani |
అనిక సురేంద్రన్, సూర్య వశిష్ట, అర్జున్ దాస్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘బుట్ట బొమ్మ’.

X
దిశ, సినిమా: అనిక సురేంద్రన్, సూర్య వశిష్ట, అర్జున్ దాస్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'బుట్ట బొమ్మ'. శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న సినిమాను ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై ఎస్ నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. కాగా జనవరి 26న విడుదలకాబోతున్న చిత్రంనుంచి తాజాగా 'పేరు లేని ఊరులోకి' అనే మొదటిపాటను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాట మొబైల్ సంభాషణల ద్వారా హీరోహీరోయిన్ ఒకరితో ఒకరు ప్రేమలో పడే అందమైన ప్రపంచాన్ని పరిచయం చేయడంతోపాటు.. పాటలోని ప్రశాంతమైన పరిసరాలు ప్రేక్షకులను ఓ కొత్త చిన్న ప్రపంచంలోకి తీసుకెళ్తాయని తెలిపారు దర్శకనిర్మాతలు. ఇక సనాపతి భరద్వాజ్ పాత్రుడు సాహిత్యం అందించిన పాటకు స్వీకర్ అగస్తీ సంగీతం అందించగా మోహన భోగరాజు ఆలపించారు.
Next Story






