దానికోసం ఏకంగా నిర్మాత రూమ్‌కే వెళ్లిన బిగ్‌బాస్ దివి.. వీడియో వైరల్

by Disha Web Desk 6 |
దానికోసం ఏకంగా నిర్మాత రూమ్‌కే వెళ్లిన బిగ్‌బాస్ దివి.. వీడియో వైరల్
X

దిశ, సినిమా: బుల్లితెర నటి దివి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు తెలుగు రియాలిటీ షోకు కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి అందరి మనసులు గెలుచుకుంది. ఆ తర్వాత పలు స్టార్ హీరోల చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ ఫొటోలు షేర్ చేస్తూ.. కుర్రాళ్లను కట్టిపడేస్తుంది. ప్రస్తుతం దివి లంబసింగి అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది ఈ మూవీ మార్చి 15న థియేటర్స్‌లో విడుదలైంది. ఇదిలా ఉండగా.. దివి తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియోను షేర్ చేసింది.

అందులో ఆమె నిర్మాత రూమ్‌కు వెళ్లడం ఆసక్తికరంగా మారింది. బేబీ సినిమా నిర్మాత ఎస్కేఎన్, రూమ్‌కి దివి చీరకట్టుతో సంప్రాదాయంగా వెళ్లింది. తను నటించిన కొత్త మూవీ లంబసింగి రిలీజ్ ఉండటంతో ప్రమోషన్స్ కోసం వెళ్లింది. అందులో నిర్మాత లాప్ టాప్‌లో ఏదో చూస్తుండగా ఆమె వెళ్తుంది. ఆ తర్వాత ఆమెకు వెల్‌కమ్ చెప్పి కూర్చో అంటారు. ఇక దివి మా సినిమా రిలీజ్ కాబోతుంది. దీంతో అతను తప్పకుండా చూడమని ప్రేక్షకులకు చెప్తాడు. అలాగే దివికి ఆల్ ది బెస్ట్ తెలిపి హిట్ కొట్టాలని అంటాడు. అదంతా స్క్రిప్టెడ్ వీడియో అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండగా అది చూసిన నెటిజన్లు కొందరు చిన్న పిల్ల అని కామెంట్లు పెడుతున్నారు. మరికొంత మంది మాత్రం ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు.

Read More..

అలాంటివి మానేసి అసలైన జర్నలిజాన్ని కాపాడండి.. మీడియాపై వరలక్ష్మి శరత్ కుమార్ ఆగ్రహం




Next Story

Most Viewed