- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మాస్ జాతర’ నుంచి ఫోక్ సాంగ్.. మాస్ స్టెప్పులతో మరోసారి దుమ్మురేపిన రవితేజ, శ్రీలీల.. సోషల్ మీడియా షేక్
మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాస్ జాతర’(Mass Jathara).

దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాస్ జాతర’(Mass Jathara). భాను భోగవరపు(Bhanu Bhogavarapu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌లో టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల(Sreeleela) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్, టీజర్, తూ మేరా లవర్ సాంగ్ ఉర్రూతలూగించాయి.
తాజాగా, ‘మాస్ జాతర’ నుంచి సెకండ్ సింగిల్ ‘ఓలే ఓలే’ సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇక ఇది ఫోక్ సాంగ్‌గా ఉంది. ‘నీ అయ్య కాడ ఉంటా.. నీ అమ్మ కాడ తింటా.. నీకాడ పంట’’ అనే మాస్ లిరిక్స్‌తో ఉన్న ఈ పాటలో రవితేజ, శ్రీలీల అదిరిపోయే స్టెప్పులతో దుమ్మురేపారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కాగా, రవితేజ, శ్రీలీ ఇప్పటికే ‘ధమాకా’ చిత్రంలో జోడీగా నటించారు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరోసారి వీరి కాంబోలో మరో ప్రాజెక్ట్ ‘మాస్ జాతర’ రాబోతుండటంతో దీనిపై అంచనాలు భారీగా పెరిగాయి.
Mass Jathara - Ole Ole Lyric Video | Ravi Teja, Sreeleela | Bheems Ceciroleo | Bhanu Bogavarapu






