సెకండ్ ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేసిన స్టార్ నటి.. బేబీ బంప్ ఫొటో వైరల్

by Disha Web Desk 10 |
సెకండ్ ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేసిన స్టార్ నటి.. బేబీ బంప్ ఫొటో వైరల్
X

దిశ, సినిమా: ప్రముఖ నటి ఎవెలిన్ శర్మ తన అభిమానులకు తీపి కబురు చెప్పింది. త్వరలోనే రెండవ బిడ్డకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపిన నటి.. సోషల్ మీడియా వేదికగా బేబీ బంప్ ఫొటోలను షేర్ చేస్తూ మురిసిపోయింది. అంతేకాదు బ్లాక్ కలర్ టాప్ ధరించిన ఆమె.. తన ఉబ్బిన పొట్టను కెమారాను దగ్గరగా పెట్టి జూమ్‌లో తీసిన చిత్రాలను పంచుకుంటూ.. 'నిన్ను నా చేతుల్లో పట్టుకోవడానికి వేచి ఉండలేను!! బేబీ #2 రాబోతుంది!' అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్‌పై స్పందిస్తున్న నటులు, ఫ్రెండ్స్, సన్నిహితులు 'పొద్దున్నే శుభవార్త చెప్పినందుకు ఆనందంగా ఉంది. దంపతులకు అభినందనలు. అందరి ప్రేమ, ఆశీస్సులు ఉంటాయి' అంటూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. అలాగే తనదైన స్టైల్‌లో రియాక్ట్ అయిన నేహా ధూపియా.. 'నా ప్రియమైన ఎవెలిన్‌కు కంగ్రాట్స్. ఇంత మంచి వార్త విన్నందుకు సంతోషంగా ఉంది. ఇద్దరూ శిశువులతో మాతృత్వాన్ని గొప్పగా ఆస్వాదించాలని కోరుతున్నా' అంటూ విష్ చేసింది.

ఇవి కూడా చదవండి : నా సుఖవంతమైన నిద్రకు ఆమె కారణం: అర్జున్ కపూర్

Next Story

Most Viewed