రానాపై నెట్టింట దారుణమైన ట్రోల్స్.. దుల్కర్ సల్మాన్ రియాక్షన్ ఇదే

by Disha Web Desk 7 |
రానాపై నెట్టింట దారుణమైన ట్రోల్స్.. దుల్కర్ సల్మాన్ రియాక్షన్ ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: దగ్గుబాటి రానా ప్రస్తుతం నెట్టింట విపరీతమైన ట్రోల్స్ ఎదుర్కొంటున్నాడు. మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తాజా సినిమా ‘కింగ్ ఆఫ్ కోత’. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దుల్కర్ గురించి మాట్లాడుతూ.. సోనమ్ కపూర్‌పై రానా చేసిన వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర దుమారం రేపాయి. దీంతో ఈ వ్యాఖ్యలపై స్పందించిన రానా.. దుల్కర్‌కు, సోనమ్‌కు సారీ చెప్తూ ఓ నోట్ రిలీజ్ చేశాడు. అయినప్పటికీ సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే దుల్కర్ స్పందించాడు.

తాజాగా ‘కింగ్ ఆఫ్ కోత’ ప్రమోషన్స్‌లో దుల్కర్ మాట్లాడుతూ.. ‘‘రానా వ్యక్తిగత వ్యాఖ్యలపై నేను మాట్లాడాలని అనుకోవట్లేదు. నాకు పరిశ్రమలో మంచి స్నేహితులు ఉన్నారు. వారిలో రానా కూడా ఒకరు. నేను ఎవరిపై కూడా కంప్లైంట్ చేయను. నా పని నేను చేసుకుంటూ పోతాను. అయితే రానా ఈ విషయాన్ని కావాలని చెప్పి ఉండరు. స్టేజ్ పైకి వచ్చాక నా గురించి మాట్లాడుతూ.. ఆయన అలా చెప్పి ఉంటారు.. అందుకే కదా తర్వాత క్షమాపణలు కూడా తెలిపారు అంటూ’’ దుల్కర్ క్లారిటీ ఇచ్చారు. చూడాలి మరి ఇప్పటికైనా ఈ ట్రోల్స్ ఆగుతాయో లేదో.

ఇవి కూడా చదవండి :

నేను హాలిడే ట్రిప్స్‌కు వెళ్తే మీకేం బాధ.. Mahesh Babu బేఫిట్టింగ్ రిప్లయ్

బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా ‘భోళా శంకర్’.. ఫైనల్‌గా ఎన్ని కోట్లు నష్టం అంటే..?



Next Story

Most Viewed