‘యుఫోరియా’ సినిమా నుంచి డబుల్ అప్డేట్స్… గుణశేఖర్ మళ్లీ మ్యాజిక్ చేయనున్నారా?

by Mallepaka Hamsa |   (  Updated:2025-12-23 15:43:44  IST  )

రుద్రమదేవి, శాకుంతలం వంటి భారీ బడ్జెట్ చిత్రాలు తెరకెక్కించిన గుణశేఖర్ (Gunasekhar)కొద్ది కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.

‘యుఫోరియా’ సినిమా నుంచి డబుల్ అప్డేట్స్… గుణశేఖర్ మళ్లీ మ్యాజిక్ చేయనున్నారా?
X

దిశ, సినిమా: రుద్రమదేవి, శాకుంతలం వంటి భారీ బడ్జెట్ చిత్రాలు తెరకెక్కించిన గుణశేఖర్ (Gunasekhar)కొద్ది కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం ‘యుఫోరియా’ (Euphoria)సినిమాతో ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇందులో భూమిక, గౌతమ్ మేనన్, నాజర్, సారా అర్జున్ (Sara Arjun)కీలక పాత్రలో కనిపించబోతున్నారు. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. కాళ భైరవ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ మంచి రెస్సాన్స్‌ను దక్కించుకోగా.. ఇప్పుడు ఇందులో ఒకేసారి రెండు అప్డేట్స్ భారీ హైప్ క్రియేట్ చేశారు. ఇందులోంచి టీజర్ విడుదల చేయగా.. ఇందులో యువత చెడు అలవాట్లకు బానిపై ఎలా చెడిపోతున్నారు? వీళ్ల వల్ల సమాజంలో ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి అనే కాన్సెప్ట్‌ ఆధారంగా తీసినట్లు తెలుస్తోంది.

దీంతో ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఇది ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు కచ్చితంగా చూడాల్సిన సినిమా అని అంతా అభిప్రాయపడుతున్నారు. ఈ మూవీ చూసి అయినా యూత్‌లో మార్పులు రావాలని కొందరు అంటున్నారు. మొత్తానికి బలమైన కథతో రాబోతున్న ‘యుఫోరియా’విడుదలకు ముందే మంచి రెస్పాన్స్‌ను దక్కించుకోవడం విశేషం. ఇక టీజర్‌తో అందరి దృష్టిని ఈ చిత్రంపై పడింది. గుణశేఖర్ ఈ సినిమాతో మళ్లీ మ్యాజిక్ చేయనున్నారు. ఇక షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 6న థియేటర్స్‌లోకి రాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

Next Story