బాలయ్య బోల్డ్ క్యారెక్టర్.. 'డబుల్ మీనింగ్' డైలాగ్స్‌తో ఫ్యాన్స్‌కు పండగే

by Disha Web Desk |
బాలయ్య బోల్డ్ క్యారెక్టర్.. డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో ఫ్యాన్స్‌కు పండగే
X

దిశ, సినిమా : దర్శకుడు గోపిచంద్ మలినేని, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది.ఈ మూవీకి సంబంధించిన ప్రతి అప్‌డేట్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నట్లుగా ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తోంది. పలు కీలక సన్నివేశాలను దృష్టిలో ఉంచుకుని బాలయ్య కోసం డైరెక్టర్ గోపి అలాంటి పవర్‌ఫుల్ డైలాగ్స్ రాసినట్లు తెలుస్తుండగా.. థియేటర్స్‌లో భారీగా పేలుతాయని కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. నిజానికి చాలా సినిమాల్లో ఇలాంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్‌ను కావాలని ఇరికించే అవకాశం ఉండగా.. బాలయ్య విషయంలో మాత్రం స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే అస్సలు వెనక్కి తగ్గరనే టాక్ ఉండనే ఉంది. అదీగాక 'పైసా వసూల్' మూవీలో బాలయ్య బోల్డ్‌నెస్‌ను ప్రేక్షకులు ఇప్పటికే చూసేశారు. అంతేకాదు స్వతహాగానూ బోల్డ్‌నెస్‌కు, సీరియస్ యాటిట్యూడ్‌కు బాలయ్య పెట్టింది పేరు. ఈ నేపథ్యంలో ఆయన డబుల్ మీనింగ్ డైలాగ్స్‌కు థియేటర్లలో అభిమానుల ఈలల మారుమోగటం పక్కా.



Next Story