ఇలాంటివి చేయడానికి మీకు సిగ్గుగా అనిపించడం లేదా.. సన్నీ డియోల్ ఫైర్

by Mallepaka Hamsa |

బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర(Dharmendra) గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు.

ఇలాంటివి చేయడానికి మీకు సిగ్గుగా అనిపించడం లేదా.. సన్నీ డియోల్ ఫైర్
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర(Dharmendra) గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు. కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతున్న ఆయన ఇటీవల ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఈక్రమంలోనే ఆయన మరణించారంటూ పలు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆయన అభిమానులు, సినీ సెలబ్రిటీలే ఆందోళన చెందారు. ఇక ఈ వార్తలు వైరల్ అయిన తర్వాత ఆయన కూతురు ఈషా దేవోల్ స్పందించి తన తండ్రి చనిపోలేదని తప్పుడు వార్తలు రాయొద్దని కోరింది. హాస్పిటల్‌లో ఉంటే ఇలాంటి వార్తలు ఆయనను బాధిస్తాయని కుటుంబం కీలక నిర్ణయం తీసుకున్నారు.

ధర్మేంద్రకు ఇంటి వద్దే చికిత్స అందించాలని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో.. మీడియా మొత్తం ఆయన ఇంటి ముందు చేరారు. దీంతో అది చూసిన ఆయన కుమారుడు సన్నీ డియోల్ (Sunny Deol)ఫుల్ ఫైర్ అయ్యాడు. ‘‘మా కుటుంబ గోప్యతకు గౌరవం ఇవ్వాలంటూ మీడియాపై మండిపడ్డారు. అలాగే మీ అందరికీ కూడా ఇంట్లో తల్లిదండ్రులతో పాటు పిల్లలు ఉన్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇలాంటి తప్పుడు వార్తలు ఇవ్వడానికి మీకు సిగ్గుగా అనిపించడం లేదా’’ అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ దండం పెడుతున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియోలు చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Next Story