Taapsee Pannu :హీరోయిన్ తాప్సీని టార్చర్ చేసిన స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

by Dishanational2 |
Taapsee Pannu :హీరోయిన్ తాప్సీని టార్చర్ చేసిన స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : హీరోయిన్ తాప్సీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ముద్దుగుమ్మ తెలుగులో చాలా సినిమాల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు.దీంతో ఈ అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్ చెక్కేసింది. కాగా, ప్రస్తుతం తాప్సీ బాలీవుడ్‌లో వరస సినిమాలతో బిజీ అయిపోయింది.

కాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీని యాంకర్, మీకు అందాన్ని చూపించడం ఇష్టమా అని అడగగా, అలాంటిదేమీ లేదు రాఘవేంద్రరావు గారి సినిమాలు అంటే ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో శ్రీదేవి, రమ్యకృష్ణ,జయప్రద లాంటి హీరోయిన్లతో ఎలా చేయించారో నాతో కూడా అలాగే చేయించారు. నా అయితే రాఘవేంద్రరావు గారు ఇచ్చిన కాస్ట్యూమ్స్ వేసుకోవడం నాకు చాలా చిరాకు వేసేది. అంతేకాదు ఆ కాస్ట్యూమ్స్ వేసుకున్నంత సేపు నేను నరకం అనుభవించేదాన్ని, అదో టార్చర్‌లా అనిపించేది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం తాప్సి (Thapsee) గతంలో మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ ‌గా మారాయి.

Read more:

మీకు పెళ్లి కావాలంటే నాతో సినిమా చేయండి: సారా కామెంట్స్ వైరల్


Next Story