సిమ్రాన్ చెల్లిని దాని కోసం వాడుకొని వదిలేసిన స్టార్ కొరియోగ్రాఫర్ ఎవరో తెలుసా?

by Jakkula Samataha |

టాలీవుడ్ సీనియర్ నటి సిమ్రాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ నటి ఎన్నో సినిమాల్లో నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. తన నటనతో వరసగా ఆఫర్స్ దక్కించుకొని, స్టార్ హీరోల అందరిసరసన నటించి స్టార్ హీరోయిన్

సిమ్రాన్ చెల్లిని దాని కోసం వాడుకొని వదిలేసిన స్టార్ కొరియోగ్రాఫర్ ఎవరో తెలుసా?
X

దిశ, సినిమా : టాలీవుడ్ సీనియర్ నటి సిమ్రాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ నటి ఎన్నో సినిమాల్లో నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. తన నటనతో వరసగా ఆఫర్స్ దక్కించుకొని, స్టార్ హీరోల అందరిసరసన నటించి స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగింది. ఇక ఈమెకు చెల్లి ఉందని చాలా తక్కువ మందికి తెలుసు. అంతే కాకుండా ఆమె కూడా తెలుగు హీరోయిన్. కానీ కొన్ని కారణాల వలన తాను సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఆమె మరణించిన సమయంలో సిమ్రాన్ తెలుగు కొరియోగ్రాఫర్ కారణంగానే తన చెల్లి చనిపోయిందని స్టేట్ మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే.

అసలు విషయంలోకి వెళ్లితే.. ఇష్టం సినిమాతో తెగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన నటి సిమ్రాన్ చెల్లి మోనాల్. ఈమె బద్రి సినిమాలో కూడా కనిపిస్తుంది. అంతే కాకుండా తెలుగులో పలు సినిమాలు చేసింది. అయితే ఆమె సినిమాలు చేస్తున్న క్రమంలో ఓ కొరియోగ్రాఫర్‌తో పరిచయం పెంచుకుంది. అది కాస్త ప్రేమగా మారడం, అతను పెళ్లిచేసుకుంటానని చెప్పడంతో, ఆయనతో సహజీవనం చేసింది. కానీ తర్వాత ఆయన తనను మోసం చేశాడని గ్రహించిన నటి సూసైడ్ చేసుకొని మరణించింది. అప్పుడు ఈ ఘటన ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. తన చెల్లి మరణాన్ని తట్టుకోలేని సిమ్రాన్ కొరియోగ్రాఫర్ ప్రసన్న సుజితే తన చెల్లి మరణానికి కారణం అంటూ తెలిపింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Next Story