‘సలార్’లో ప్రభాస్‌ను హైలెట్ చేసిన తాత ఎవరో తెలుసా..?

by Disha Web Desk 7 |
‘సలార్’లో ప్రభాస్‌ను హైలెట్ చేసిన తాత ఎవరో తెలుసా..?
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమా ‘సలార్’. ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఈ సినిమా టీజర్ రానే వచ్చింది. ఫుల్ ఆఫ్ యాక్షన్ సీన్స్‌తో దూసుకుపోయిన ఈ టీజర్‌పై విశేష స్పందన లభించింది. ఇక ఇందులో ఓ తాతని బాగా హైలెట్ చేసి చూపించారు. ప్రభాస్ పాత్రను ఆకాశానికెత్తేస్తూ ఎలివేషన్స్ ఇచ్చిన ఆ నటుడు ఎవరా అంటూ నెట్టింట తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇంతకు అతను ఎవరంటే.. బాలీవుడ్ సీనియర్ యాక్టర్ టినూ ఆనంద్. అప్పట్లో బాలకృష్ణ ‘ఆదిత్య 369’ సినిమాలో టైం మిషన్‌ని కనిపెట్టే ప్రొఫెసర్ రామ్ దాస్ అనే సైంటిస్ట్ పాత్రలో కనిపించి అలరించారు. తర్వాత కొన్ని తెలుగు చిత్రాల్లో మెరిసిన ఆయన.. మరోసారి ‘సలార్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Also Read..

Salaar : ఆ స్టార్ హీరో‌ వదులుకున్నాకే.. ప్రభాస్ వద్దకు ‘సలార్’ స్టోరీ!



Next Story

Most Viewed