Rakul Preet Singh: మహేష్ బాబు వల్ల టాలీవుడ్‌కు దూరం.. రకుల్ సెన్సేషనల్ కామెంట్స్

by Mallepaka Hamsa |

‘కెరటం’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చి తెలుగులో దాదాపు హీరోలందరితో నటించి స్టార్ హీరోయిన్‌గా మారింది అందాల తార రకుల్ ప్రీత్‌సింగ్(Rakul Preet Singh).

Rakul Preet Singh: మహేష్ బాబు వల్ల టాలీవుడ్‌కు దూరం.. రకుల్ సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: ‘కెరటం’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చి తెలుగులో దాదాపు హీరోలందరితో నటించి స్టార్ హీరోయిన్‌గా మారింది అందాల తార రకుల్ ప్రీత్‌సింగ్(Rakul Preet Singh). రామ్ చరణ్(Ram Charan), ఎన్టీఆర్, నాగార్జున, మహేష్ బాబు(Mahesh Babu), రవితేజ వంటి వారితో నటించి పలు హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. నాన్నకు ప్రేమతో, సరైనోడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో రకుల్ క్రేజ్ మరింది పెరిగిందనే చెప్పాలి. అమ్మడు అందం, అభినయంతో పాటు తన నటనతో ఎంతోమంది అభిమానులను దక్కించుకుంది. అయితే ఒక సినిమా సక్సెస్ అయితేనే వరుస అవకాశాలు రావడం కామన్ అలాంటిది ఎన్నో హిట్స్ సాధించిన రకుల్‌కు కెరీర్ పీక్స్‌లో ఉండగా మహేష్ బాబుతో నటించే చాన్స్ వచ్చింది.

అలా ఏఆర్ మురగదాస్, సూపర్ స్టార్ మహేష్ కాంబోలో వచ్చిన ‘స్పైడర్’లో హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ మూవీ బాక్సాఫీసు వద్ద ఊహించని విధంగా బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. భారీ అంచనాల మధ్య వచ్చి ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. రెండు భాషల్లో విడుదలైనప్పటికీ ఎక్కడ కూడా సక్సెస్ సాధించలేకపోయింది. ఇక 2017లో వచ్చిన ఈ సినిమా రకుల్ కెరీర్‌పై ప్రభావం బాగానే చూపించింది. దీని తర్వాత తెలుగులో రకుల్ కనిపించలేదు. బాలీవుడ్ చెక్కేసిన ఈ భామ అక్కడ వరుస చిత్రాల్లో నటిస్తోంది. ఇప్పటికీ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్‌తో ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతుంది.

తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ టాలీవుడ్‌కు దూరం అవడంపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘‘నేను తెలుగు ఇండస్ట్రీలో రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో నటించాను. అలాగే తెలుగులో చాలా ప్రాజెక్ట్స్ చేశాను. వరుసగా8-9 హిట్స్ వచ్చాయి. కానీ ‘స్పైడర్’ నా కెరీర్‌లో మొదటి డిజాస్టర్ సినిమా. అంచనాలు తారుమారైనప్పుడు ఎలా ఉంటుందో నాకు మొదటిసారి అర్థమైంది. ఇది నాకు నాకు చేధు అనుభవంగా మారింది. ఆ బాధను తట్టుకోలేకపోయాను. అందుకే ఈ ఇండస్ట్రీకి దూరం అయ్యాను. ఈ సినిమా తర్వాత ఇక్కడ అవకాశాలు వచ్చినా రిజెక్ట్ చేశాను’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఇది చూసిన సూపర్ స్టార్ అభిమానులు పలు రకాలుగా స్పందిస్తున్నారు.

Next Story