- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఆవారాపన్ 2’ లో దిశా పటానీకి పవర్‌ఫుల్ పాత్ర.. ఇమ్రాన్‌తో కెమిస్ట్రీ అదిరిపోవాల్సిందే!
కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, ఇమ్రాన్ హష్మీ సరసన అత్యంత పవర్‌ఫుల్, ఎమోషనల్ పాత్రలో దిశా మెరిసిపోనుంది.

దిశ, సినిమా: బాలీవుడ్ గ్లామర్ క్వీన్ దిశా పటానీ ఇప్పుడు ఒక సెన్సేషనల్ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ఇమ్రాన్ హష్మీ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన ‘ఆవారాపన్’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘ఆవారాపన్ 2’లో దిశా హీరోయిన్‌గా నటిస్తోంది. ‘ఆవారాపన్ 2’ చిత్రంలో దిశా పటానీ భాగం కావడంతో సినిమా స్థాయి మరింత పెరిగిందని చిత్ర బృందం భావిస్తోంది. నిర్మాత విశేష్ భట్ మాట్లాడుతూ.. "దిశా పటానీ ఈ ప్రాజెక్ట్‌లో చేరడం వల్ల ‘ఆవారాపన్’ ప్రపంచం సరికొత్త అవకాశాలకు వేదికైంది’’ అని ప్రశంసించారు. కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, ఇమ్రాన్ హష్మీ సరసన అత్యంత పవర్‌ఫుల్, ఎమోషనల్ పాత్రలో దిశా మెరిసిపోనుంది. వీరిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ, దిశా యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని సమాచారం.
ఇమ్రాన్ హష్మీ సినిమాలంటేనే పాటలు ఒక రేంజ్‌లో ఉంటాయి. ఈ సీక్వెల్‌లో కూడా దిశా పటానీపై చిత్రీకరించే పాటలు మళ్ళీ పాత ‘ఆవారాపన్’ మ్యాజిక్‌ను తీసుకువస్తాయని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. నితిన్ కక్కర్ దర్శకత్వంలో రాబోతుంది. విశేష్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ డ్రామా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. స్వాతంత్ర్య దినోత్సవ వీకెండ్‌లో విడుదలవుతున్న ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఎదురుకానుంది. సన్నీ డియోల్ నటించిన ‘లాహోర్ 1947’ ఆగస్టు 13న విడుదల కాబోతుండగా, మరుసటి రోజే దిశా తన ‘ఆవారాపన్ 2’తో థియేటర్లలోకి రానుంది. ఒకవైపు సన్నీ డియోల్ మాస్ పవర్, మరోవైపు దిశా పటానీ గ్లామర్ అండ్ యాక్షన్.. ఈ పోటీ బాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది.






