దుల్కర్ సల్మాన్ సినిమాలో డిజాస్టర్ బ్యూటీ ఫిక్స్.. ఐరన్ లెగ్ లేడీ అస్సలు వద్దు అంటూ నెటిజన్ల కామెంట్స్!

by Mallepaka Hamsa |

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) ‘సెకండ్ షో’ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.

దుల్కర్ సల్మాన్ సినిమాలో డిజాస్టర్ బ్యూటీ ఫిక్స్.. ఐరన్ లెగ్ లేడీ అస్సలు వద్దు అంటూ నెటిజన్ల కామెంట్స్!
X

దిశ, సినిమా: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) ‘సెకండ్ షో’ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మలయాళంలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన ఆయన ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నారు. తెలుగులోనూ ‘మహానటి’ వంటి బ్లాక్ బస్టర్ మూవీలో నటించారు. ఇక 2022లో దుల్కర్ సల్మాన్ చేసిన ‘సీతారామం’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులకు మంత్ర ముగ్దులను చేశారనడంలో అతిశయోక్తి లేదు. గత ఏడాది ‘లక్కీ భాస్కర్’తో బాక్సాఫీసును షేక్ చేశారు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఆయన నటిస్తున్న చిత్రాల్లో ‘ఐయామ్ గేమ్’(I am game) ఒకటి. ఈ యాక్షన్ ప్యాక్డ్ మూవీ నహాస్ ఫిధాయత్(Nahas Fidhayath) దర్శకత్వంలో తెరకెక్కుతోంది.

ఈ సినిమాను వెఫారర్ ఫిల్స్ బ్యానర్‌పై దుల్కర్ సల్మాన్ నిర్మిస్తున్నారు. ఇందులో యాంటోని వర్గీస్, మిస్కిన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి జెక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. తాజాగా, ‘ఐయామ్ గేమ్’ మూవీలో హీరోయిన్ ఫిక్స్ అయినట్లు పలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో దుల్కర్ సల్మాన్ సరసన టాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే నటిస్తున్నట్లు టాక్. ఈ అమ్మడును మూవీ టీమ్ సంప్రదించగా.. నటించేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇక వాటిని చూసిన నెటిజన్లు డిజాస్టర్ బ్యూటీ అస్సలు వద్దు అని అంటున్నారు. కాగా, ఇటీవల పూజా హెగ్డే నటించిన భజరంగీ బాయ్‌జాన్, దేవ, రెట్రో వంటి మూవీస్ భారీ డిజాస్టర్‌గా నిలిచాయి. గత కొద్ది కాలంగా ఈ అమ్మడుకి బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఆమె నటించే సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద హిట్ సాధించడం లేదు. దీంతో ఆమెకు అవకాశం ఇవ్వాలన్నా దర్శక, నిర్మాతలు భయపడుతున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడు తలపతి విజయ్ ‘జన నాయగన్’ మూవీలో నటిస్తోంది. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ ‘కూలీ’లోనూ కీలక పాత్రలో కనిపించనుంది.

Next Story